అభిశంసన హీట్ : భారత పర్యటనకు ట్రంప్ వ్యూహం

Submitted on 14 January 2020
Talks underway for Trump to visit India as impeachment heats

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్‌ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. అవిశ్వాస తీర్మానం అమెరికాలో వేడి పుట్టించింది. ఈ క్రమంలో భారత పర్యటనకు ట్రంప్ ప్లాన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారత పర్యటనకు రానున్నారని సమాచారం. ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరు దేశాల అధినేతలకు వీలయ్యే తేదీని ఖరారు చేసే పనిలో వైట్ హౌస్ అధికారులు ఉన్నారట. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, పౌర విమానయాన ఒప్పందంపై ఈ టూర్ లో సంతకాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2009 తర్వాత ఆ స్థాయిలో పతన దశలో భారత దేశ ఆర్థిక వృద్ధి ఉంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రంప్ అధికారం చేపట్టాక.. భారత్ కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. భారత పర్యటనకు రావాలని ప్రధాని మోడీ జనవరి 7న ట్రంప్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారట. దీనికి ట్రంప్ ఇంట్రస్ట్ చూపించారట. అమెరికాలో నవంబర్ లో ఎన్నికలు ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు, ట్రంప్‌పై అమెరికన్ కాంగ్రెస్‌లో అభిశంసన తీర్మానం చర్చల దశలో ఉంది. ఆ తర్వాత పరిణామాల ఆధారంగా ట్రంప్ భారత పర్యటన తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాని మోడీ 2017 జూన్ లో అమెరికాలో పర్యటించినప్పుడే ట్రంప్ ను రావాలని కోరారు. ఆ తర్వాత మరోసారి 2019 రిపబ్లిక్ పరేడ్ కు రావాలంటూ ఆహ్వానం పంపారు. అయితే పలు కారణాలతో భారత పర్యటనకు రాలేనని ట్రంప్ చెప్పారు. కానీ ఏదో ఒక సమయంలో తప్పకుండా ఇండియా వస్తానని ట్రంప్ చెప్పారు. భారత్‌లో చివరిసారిగా అడుగుపెట్టిన అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. 2015లో భారత రిపబ్లిక్ పరేడ్ కు హాజరై.. ఈ కార్యక్రమానికి వచ్చిన తొలి అమెరికా ప్రెసిడెంట్‌గా ఒబామా నిలిచారు.

talks
underway
donald trump
india
Visit
Tour
america
IMPEACHMENT
Modi
BJP

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు