కష్టానికి మించిన రిజర్వేషన్‌ లేదు : టైలర్ కూతురికి MBBS సీటు

Submitted on 11 July 2019
Tailor's Daughter Gets Admission To Madras Medical College Without Reservation

కష్టపడి చదివితే ఏ రిజర్వేషన్ అక్కర్లేదని నిరూపించిందో పేద విద్యార్థిని. ఆర్థికంగా వెనుకబడిన చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోలేక మధ్యలోనే ఆగిపోతున్నారు. పేదరికం వెక్కిరించడంతో ప్రతిష్టాత్మక మెడికల్ వైద్యవిద్యలో సీటు సంపాదించలేకపోతున్నారు. దీనికి తోడు రిజర్వేషన్ తోడువడంతో మెడికల్ సీటు కలగానే మిగిలిపోతోంది. కష్టాన్నే నమ్ముకున్న ఓ పేద టైలర్ కుమార్తె.. మద్రాసు మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. కష్టపడి చదివింది.. ఆ కష్టమే తనను ఎంబీబీఎస్ సీటు సంపాదించుకునేలా చేసింది. నేటి తరం యువతీయువకులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె పేరు.. పి.జీవిత. చెన్నైలోని అంకపుత్తూరులో నివాసముండే ఓ పేద టైలర్ కూతురు.

రిజర్వేషన్ తో సంబంధం లేకుండా కష్టపడి చదివి పెద్ద మెడికల్ కాలేజీలో జనరల్ కేటగిరీలో మెడికల్ సీటు సంపాదించుకుంది. ‘ఈ రోజు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. చివరికి ఆ రోజు రానే వచ్చింది. చాలా సంతోషంగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేసింది. నీట్ పరీక్షలో జీవిత 605 స్కోరు చేసింది. కానీ, ఆ తర్వాత మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కు అర్హత సాధించింది.

వైద్య విద్యను కొనసాగించడానికి ఆమె కుటుంబ ఆర్థిక స్థోమత సరిపోదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళిసాయి సుందరాజన్ జీవిత విద్యకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అంకపుత్తూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న జీవిత.. ఇంటర్ లో 1161 మార్కులు సాధించింది.

2018లో నీట్ కోచింగ్ తీసుకున్నప్పటికీ పరీక్షలో 351 మార్కులు మాత్రమే స్కోరు చేయగలిగింది. దీంతో మరో ఏడాది వరకు ఎదురుచూసిన అనంతరం రెండోసారి ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకుంది. మద్రాసు మెడికల్ కాలేజీలో 605 మార్కులతో సీటు సంపాదించుకుంది.

దీనిపై విద్యార్థిని జీవిత మాట్లాడుతూ.. ‘నా సంతోషాన్ని ఎలా తెలియజేయాలో తెలియడం లేదు. ఎంబీబీఎస్ చదివిన తర్వాత గైనకాలజీ, అబెస్ట్రిక్స్ స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండే నా ఫేవరేట్ స్పెషాలిటీ. నీట్ కోచింగ్ క్లాసులకు వెళ్లే స్థోమత లేని పేద విద్యార్థులకు సాయం చేయాలని ఉంది. నా చదువులు పూర్తి అయ్యాక కచ్చితంగా పేదలకు సాయం చేస్తాను. నా జీవితంలో పడిన కష్టాలను మరో విద్యార్థి ఎదుర్కొకూడదు. కష్టపడి చదువుతాను’ అని చెప్పుకొచ్చింది.

Tailor's Daughter
Admission
Madras Medical College
RESERVATION
Jeevitha
NEET examination
Tamilisai Soundararajan


మరిన్ని వార్తలు