పిల్లల్లో కాళ్లనొప్పులు ఎందుకు వస్తాయి?

Submitted on 15 May 2019
Symptoms of Growing Pains In Childrens

6 ఏళ్ల పిల్లవాడు ఆడుకుని రాగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడనుకోండి.. ఆటల వల్ల అలసిపోయాడేమో అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు కాళ్లు నొప్పులమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే.. బాగా ఆడావ్ కదా.. నొప్పులు అవే పోతాయ్ లే అంటూ సర్దిచెప్తుంటాం. చాలావరకు ఇలా ఎక్కువగా ఆడడం వల్లనే కాళ్ల నొప్పులు రావొచ్చు. కానీ పిల్లలు కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు అంటుంటే వాటి వెనుక వేరే కారణాలు కూడా ఉండొచ్చంటున్నారు పిల్లల వైద్య నిపుణులు.  

పిల్లల్లో గ్రోత్, డెవలప్ మెంట్, యాక్టివ్ గా ఆడుకోవడం, అల్లరి చేయడం అన్నీ సాధారణంగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ నొప్పులకు అతి సాధారణమైన కారణం శరీరం ఎదిగేటప్పుడు.. బాడీతో పాటు ఎముకలు స్ట్రెచ్ అవుతాయి. ఎముక పై భాగాన్ని పెరియాస్టియమ్ అంటారు. దీనికి నర్వ్ సప్లయ్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎముకలోని పెరియాస్టియమ్ భాగం స్ట్రెచ్ అయినప్పుడు నొప్పి రావడం సహజం. చాలామంది పిల్లలు తమకు నొప్పి వస్తోందని చెప్పలేరు. కాని అస్తమానం చిరాకు పడుతుంటారు. చాలా ఇరిటబుల్ గా ఉంటారు. స్కూల్ కి వెళ్లడానికి ఇష్టపడరు. దీని వెనకాల బాధ ఉందా అనేది గ్రహించాలి. ఈ సింప్టమ్స్ ని కనిపెట్టి అది ఎందుకనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

పిల్లల్లో కొన్నిసార్లు ఏదైనా ప్రమాదకరమైన జబ్బు ఉన్నప్పుడు కూడా ఇలా నొప్పులు రావొచ్చు. పిల్లల్లో కనిపించే జన్యు వ్యాధుల్లో ఒకటి ఫైబ్రోమయాల్జియా. ఇది మస్కులో స్కెలిటల్ సిస్టమ్ కి సంబంధించిన వ్యాధి. ఎముక, కీలు, ఎముక మీద ఉండే కండరాలను కలిపి మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటారు. 

చాలా సందర్భాల్లో పెద్దవాళ్లకు కూడా ఏదైనా జ్వరం వచ్చి తగ్గిన తరువా కాళ్ల నొప్పులు రావడం కనిపిస్తుంటుంది. సాధారణంగా వైరల్ ఫీవర్లు వచ్చినప్పుడు ఇలాంటి పెయిన్స్ వస్తుంటాయి. పిల్లల్లో కూడా అంతే జ్వరంతో పాటుగా ఒళ్లునొప్పులు లేదా కాళ్ల నొప్పులు ఉండొచ్చు. కొన్ని సార్లు జ్వరం తగ్గిన తరువాత కూడా ఆ నొప్పులు ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఇన్ ఫెక్షన్ కి మందులు తీసుకుంటే క్రమంగా సమస్యలు తగ్గిపోతాయి. ఈ లక్షణాలను బట్టి వెంటనే డాక్టర్ ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది.

Symptoms of Growing Pains
Childrens
2019

మరిన్ని వార్తలు