సైరా సై సైరా: పవన్ కళ్యాణ్ వస్తున్నాడు.. కేటీఆర్ రావట్లేదు

Submitted on 12 September 2019
SyeRaaPreReleaseEvent & Trailer Launch will be held at LB Stadium

సైరా సై సైరా అంటూ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధం అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ మీద రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, శాండిల్ వుడ్ నుండి కిచ్చా సుదీప్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు వంటి పెద్ద పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటించగా సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా గాంధీ జయంతి సంధర్భంగా అక్టోబర్ 2వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా.. సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 18వ తేదీన చేయనున్నట్లు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు ప్రత్యేక అతిథులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేయనున్నట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. అయితే మళ్లీ మరో ట్వీట్ ద్వారా కేటీఆర్ కు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఆయన రావట్లేదని వెల్లడించింది. ఈ వేడుకలోనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

SyeRaaPreReleaseEvent
Trailer Launch
LB Stadium
KTR
Pawan kalyan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు