సైరా డిజిటల్ రైట్స్ రూ.125 కోట్లు!

Submitted on 18 September 2019
sye raa digital rights sold for 125 crores

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. 'సైరా.. నరసింహారెడ్డి'.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీమతి సురేఖ సమర్పణలో.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతుంది.

ఒక్క థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ.190 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. మరోవైపు శాటిలైట్, డిజిటల్ రైట్స్ విషయంలోనూ సైరా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జీ నెట్ వర్క్ సంస్థ సైరా అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఏకంగా రూ.125 కోట్లకు కొన్నట్టు తెలుస్తుంది.

బాహుబలి, సాహో తర్వాత ఇంత భారీ ధర పలికిన సౌత్ సినిమా సైరానే కావడం విశేషం. కేవలం తెలుగు వెర్షన్ కోసం రూ.40 కోట్లు, మిగతా భాషలకోసం రూ.85 కోట్లు పెట్టినట్టు సమాచారం. సెప్టెంబర్ 18 సాయంత్రం సైరా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చెయ్యనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న భారీగా విడుదలవనుంది సైరా..   

Megastar Chiranjeevi
Rathnavelu
Amit Trivedi
Ram Charan
Surender Reddy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు