స్వైన్ ఫ్లూ టెర్రర్ : గాంధీలో 5గురికి చికిత్స

Submitted on 22 January 2019
Swine Flu Terror

హైదరాబాద్‌ : నగరంలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. స్వైన్‌ ఫ్లూ రోగుల సంఖ్య పెరుగుతోంది. గత వారం గాంధీ ఆస్పత్రిలో చేరిన పది మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్‌ వచ్చిందని ఆస్పత్రి సూపరింటెండ్‌ శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. వీరికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ ఫ్లూ బాధితుల్లో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా వైద్యులు తెలిపారు. ఐదుగురిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.

 

ఒకేసారి ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేగింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వైన్‌ ఫ్లూ లక్షణాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. దగ్గు, జలుబు, నీరసం, జ్వరం, కళ్లు మండటం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను కలవాలని చెప్పారు. వాతావరణంలోని మార్పులే స్వైన్ ఫ్లూకి కారణమని వైద్యులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

swine flu terror
Hyderabad
gandhi hospital
swine flu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు