ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

Submitted on 21 October 2019
Surgeons of Tamil Nadu Veterinary and Animal Sciences University, Vepery removed 52 kg of plastic wastes (pic 2) from the stomach of a cow

 ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ సర్జన్స్. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్న ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.  ఆవుకు 5.5 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

ఈ వ్యర్థాలతో పాటు రెండు స్క్రూలు, ఒక నాణెం కూడా ఉన్నట్లు సర్జన్లు చెప్పారు. ఆవు కడుపులోని ఒక అన్నాశయంలో 75శాతం ప్లాస్టిక్స్ వర్థాలు ఆక్రమించినట్లు సర్జన్ డాక్టర్ వెలవెన్ తెలిపారు. ఆవుకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు.

cow
Plastic
tamilnadu
removed
SURGEONS
RUMEN
OCCUPIED
STOMOCH

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు