మరోసారి మానవత్వం చాటుకున్న ‘తలైవా’

Submitted on 21 October 2019
Superstar Rajinikanth once again showed  his kindness on poor people

సూపర్ స్టార్ రజినీకాంత్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నారు. ఆయణ్ణి దేవుడిలా కొలిచే అభిమానులు, తమిళ ప్రజలకు తన వంతు సహాయం అందించి రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు.. ఇటీవల తమిళనాడులో తుపాను కారణంగా ఎంతో మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పట్లోనే రజినీకాంత్ ప్రభుత్వానికి విరాళం అందించారు.

మరికొంత మంది నిరుపేదలకు ఇప్పుడు ఇళ్లను నిర్మిస్తూ ‘తలైవా’ అనే పదానికి సరైన అర్ధం చెప్పారు. నాగపట్నంలోని పది కుటుంబాలకు ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించారు రజినీ.. ప్రస్తుతం సూపర్ స్టార్‌కి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కష్టాల్లో ఉన్న నిర్మాత కళైజ్ఞానం (తన తొలి చిత్ర నిర్మాత) కు కూడా రజిని కొత్త ఇంటిని అందించిన విషయం తెలిసిందే.

Read Also : చరిత్రను వక్రీకరించొద్దు : ‘ఆర్ఆర్ఆర్’‌పై అల్లూరి యువజన సంఘం అభ్యంతరం

ఇక మళ్ళీ ఇప్పుడు మరో పదిమందికి సొంత గూటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తలైవా ‘దర్బార్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మురగదాస్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే సిరుత్తై శివ డైరెక్షన్‌లో త్వరలో మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

 

Superstar Rajinikanth
Rajinikanth showed his kindness on poor people

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు