‘అసురన్’ అద్భుతంగా ఉంది : మహేష్ ట్వీట్, ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ

Submitted on 21 October 2019
Superstar Mahesh Babu Tweet About Asuran Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెలిసిందే.. తను చూసిన సినిమా నచ్చితే.. ఆ సినిమా టీమ్‌కి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేస్తుంటాడు మహేష్.. రీసెంట్‌గా తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘అసురన్’ సినిమా చూసి మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో సినిమా 'అసురన్' దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. రీసెంట్‌గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ‘అసురన్’ లో ధనుష్.. ద్విపాత్రాభినయం చేశాడు.. అతనికి జోడిగా మంజు వారియర్ నటించింది.


Read Also : దుమ్మురేపుతున్న ‘డిస్కోరాజా’ సాంగ్

మహేష్ ఈ సినిమా చూసి.. ‘సినిమా అద్భుతంగా ఉంది, టీమ్ అందరకీ కంగ్రాట్స్’ అంటూ ట్వీటాడు.. తమ హీరో సినిమా గురించి మహేష్ ట్వీట్ చేయడంతో ధనుష్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతూ.. ‘ఊరికే సూపర్ స్టార్ అవుతారా’ అంటూ మహేష్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..

Dhanush
Manju Warrier
GV Prakash Kumar
Kalaipuli S.Thanu
Vetri Maaran

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు