గుడ్ న్యూస్.. 29 నుంచి జూనియర్ కళాశాలకు వేసవి సెలవులు

Submitted on 14 March 2019
Summer Holidays For Intermediate Junior Colleges From March 29th

ఏపీలో జూనియర్‌ కాలేజీలకు మార్చి 29 నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి బుధవారం (మార్చి 13,2019)న ప్రకటించారు. తిరిగి జూన్ 3న కళాశాలలు తెరచుకుంటాయని వెల్లడించారు.
Read Also : మే 22 డీఈఈసెట్ పరీక్ష

అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల అన్ని ప్రిన్సిపల్స్ మరియు యాజమాన్యాలు వేసవి సెలవుల్లో ఏ తరగతులను నిర్వహించకూడదని.. నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే మాత్రం చర్యలు తప్పవని ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. 

* 12న ఇంటర్ ఫలితాలు.. 
ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు ఉదయలక్ష్మి తెలిపారు.

Summer Holidays
Intermediate Colleges
March 29
2019

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు