కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : సీఈవో ద్వివేది

Submitted on 20 May 2019
Strong security arrangements for counting : CEO Dwivedi

రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సీఈవో ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులు ఫాం-17సీ, ఈవీఎంలతో సరిపోవాలన్నారు. రెండింటి లెక్కల్లో తేడా వస్తే రెండో సారి లెక్కిస్తారని చెప్పారు.

అన్ని చోట్ల ఒకేసారి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు చివర్లో ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వస్తే రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమన్నారు. ఏదైనా కేంద్రంలో పార్టీల మధ్య తక్కువ మార్టిన్ వస్తే రీకౌంటింగ్ కు ఆదేశించే అవకాశం ఉందన్నారు. రీకౌంటింగ్ పై ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

ఆదివారం (మే 19, 2019)వ తేదీన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వైసీసీ ఫిర్యాదుతో ఎన్‌ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో రీపోలింగ్ జరిగింది. టీడీపీ ఫిర్యాదు మేరకు కుప్పం బాదూరు, కాటేపల్లిలో రీపోలింగ్ నిర్వహించారు. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఒకే రోజు రీపోలింగ్ జరిగింది.

 

 

Strong security
Arrangements
counting
Votes
Elections
CEO Dwivedi
Amaravathi

మరిన్ని వార్తలు