ఉల్లి తాళం చూశారా : పక్కలో పెట్టుకుని పడుకుంటా

Submitted on 2 December 2019
Steep onion prices become fodder for hilarious memes and jokes online

దేశవ్యాప్తంగా ఉల్లి డిమాండ్ పెరిగిపోయి రేట్లు ఆకాశానికి తాకాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ వందకు తక్కువ దొరకడం లేదు. ట్రేడర్ల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారస్థులు వెనువెంటనే ధరల్లో మార్పు చూపించడంతో వాటిపై మెమేలు, జోకులు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

ఒక్క ఉల్లిపాయతో చికెన్ ఆహా.. అదుర్స్!. 'ధరలు పెరుగుతున్న కొద్దీ ఉల్లిపాయ రుచి పెరుగుతుంది'. 'ఉల్లి ధరలు పెరగడంతో పఫ్‌లలో ఉల్లికి బదులు చికెన్‌యే ఎక్కువగా కనిపిస్తుంది' 'ఉల్లిపాయ డాలర్ కంటే ధృడమైనది' 'ఉల్లిపాయ కేజీ రూ.80 అయింది. బ్యాగును పక్కలో పెట్టుకుని పడుకుంటా' అంటూ ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయి. 

 

ఎన్ని రోజులైనా ధరల్లో తగ్గుదల కనిపించకపోవడంతో ఉల్లిధరల జోకులు  ఫ్రెష్‌గానే అనిపిస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట పూర్తిగా దెబ్బతింది. వాటితో పాటు మిగిలిన కూరగాయాల్లోనూ స్వల్పపాటి పెరుగుదల కనిపిస్తుంది. కేంద్రం ధరలు నియంత్రించే క్రమంలో భారత్‌కు ఎగుమతి చేసేందుకు ఇతర దేశాలకు 10శాతం పన్ను రాయితీ ఇచ్చింది. 

hilarious memes
Jokes
Onion prices
onion

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు