30 నిమిషాల్లో : వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శనం

Submitted on 14 September 2019
Srivari free vision for the elderly Within 30 minutes

టీటీడీ వృద్ధులకు తీపి కబురు అందించింది. వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శన సౌకర్యం కల్పించింది. 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఉదయం 10, సాయంత్రం 3 గంటలకు ఉచిత దర్శనం అవకాశాన్ని కల్పించారు.

ఫొటోతో ఉన్న వయస్సు నిర్ధారణ పత్రాలు తమ వెంట ఉంచుకుని భక్తులు ఎస్‌-1 కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుంది. ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద కోడ పక్కనే మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. కూర్చోవడానికి మంచి సీట్లు ఏర్పాటు చేసి ఉంటాయి. సాంబారు అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు.

రూ.20కి రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. ఇంకా లడ్డూలు కావాలనుకుంటే రూ.25కు ఒక లడ్డూ చొప్పున ఎన్ని టోకెన్లైనా ఇస్తారు. కౌంటర్‌ నుంచి గుడికి, గుడి నుంచి కౌంటర్‌ వరకు బ్యాటరీ కారులో ఉచితంగా చేరవేస్తారు. వీరి దర్శనం కోసం అన్ని క్యూలైన్లు నిలిపివేస్తారు. ఎటువంటి వత్తిళ్లు, తోపులాటలు లేకుండా 30 నిమిషాల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది.
 

Srivari
free vision
Elderly
30 minutes
Tirumala
Chittoor
TTD

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు