వాహ్..సాలీడు సోలో టాలెంట్!!.. ఇంజనీర్ కూడా సరిపోడు..

Submitted on 22 February 2020
 spider web is buidling a home. Not a single degree of flaw.

ఇంటికి ప్లాన్ వేయాలంటే  ఇంజనీరు అన్ని కోణాలను పరిశీలించి తన చదువుని రంగరించి ప్లాన్ వేస్తాడు. అన్నీ డిగ్రీల్లోను ఇల్లు పర్ ఫెక్ట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సాలీడు (స్పెడర్)కు అటువంటి లెక్కలేమీ అవసరం లేదు. చాలా ఈజీగా చాలా స్పీడ్ గా గూడు ( "స్పైడర్ వెబ్")ను అల్లేస్తుంది. అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక్క డిగ్రీ కోణం తేడా లేకుండా..మేధావి అయిన ఇంజనీర్ ప్లాన్ వేసినట్లుగా..ఎంతో అనుభవం ఉన్న చేనేత కళాకారుడు బట్టలపై డిజైన్ వేసినట్లుగా..చకచకా గూడును అల్లేసిందీసాలీడు.  ఏదో ప్లాన్ వేసినట్లుగా ముందుగానే దానికి తగినట్లుగా తన లాలాజలంతో సపోర్టును అల్లుకుంది. వాటిని ఆధారం చేసుకుని చక్కటి డిజైన్ వేసిన ఈ సాలీడు అల్లిన డిజైనర్ వెబ్.. ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పిచ్చుకల గూడు అల్లిక..చీమల పుట్ట పెట్టే విధానం..సాలీడు గూడు అల్లే పద్దతి మనిషికి ఎప్పుడూ వింతే..ఎప్పటికీ ఆశ్చర్యమే. మనుషులు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువులు చదువుకుని కట్టిన బ్రిడ్జీలు..భవనాలు కూలిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 
కానీ ఓ చిట్టి పిచ్చుక అల్లి గూడు ఎంత గాలి వాన వచ్చినా చెట్టునుంచి ఊడిపడుతుందే కానీ ఆ గూడు ముక్కలు కాదు. అలాగే చిన్న పాటి చీమలు కట్టిన పుట్ట కూడా చాలా గట్టిగా ఉంటుంది. అలాగే సాలీడు గూడు చూడటానికి సున్నితంగా కనిపిస్తుంది గానీ చాలా స్ట్రాంగా ఉంటుంది. పైగా సాలీడు గూడు నేసే విధానం చాలా చాకచక్యంతో కూడుకున్నది. అత్యంత వినూత్నమైనది కూడా. 

SPIDER
web is buidling
home
Not a single degree of flaw

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు