భూ వివాదాలకు చెక్ : ప్లాట్లకు ఆధార్ తరహాలో UID నంబర్లు

Submitted on 18 September 2019
Soon, lands will have Aadhaar-like unique ID numbers

భూ వివాదాలకు చెక్ పెడుతూ త్వరలో ఆధార్ తరహాలో భూస్వాముల స్థలాలకు ఐడెంటిఫికేషన్ నెంబర్లు జారీ కానున్నాయి. భూ స్థల యాజమాన్యానికి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకుండా ఉండేలా ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. అచ్చం ఆధార్ కార్డు మాదిరిగానే భూస్వాముల స్థలాలకు కూడా యూనిక్ నెంబర్లను కేటాయిస్తారు. సర్వే చేసిన ప్రతి ప్లాట్ కోసం ప్రామాణిక ఏకైక సంఖ్యను జారీ చేసేందుకు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

స్థలానికి కేటాయించిన యూనిక్ నెంబర్‌లో.. రాష్ట్రం, జిల్లా లేదా జిల్లా పరిషత్, తాహ్‌సిల్ లేదా తాలూకా, బ్లాక్ లెవల్, వీధి సమాచారం, అవసరమైన చోట ప్లాట్ పరిమాణం, యజమాని వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ తర్వాత యూనిక్ ల్యాండ్ పార్శిల్ నెంబర్‌ను క్రమంగా ఆధార్, రెవిన్యూ కోర్టు సిస్టమ్ కు అనుసంధానం చేయడం జరుగుతుందని పేరు చెప్పేందుకు అంగీకరించని అధికారి ఒకరు తెలిపారు. 

ప్లాట్లకు యూనిక్ నెంబర్లను కేటాయించడం వల్ల రియల్ ఎస్టేట్ లావాదేవీలను సులభతరం చేయొచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. తద్వారా ఆస్తుల పన్నుల విధానంలోని సమస్యలను తేలికగా పరిష్కరించవచ్చునని చెప్పారు. ఒక సింగిల్ నెంబర్ తో వ్యక్తిగత ఆధార్ మాదిరిగా.. స్థలానికి సంబంధించి క్రయవిక్రయాలు, పన్నుల సేకరణ, ప్లాట్ యాజమాన్యానికి సంబంధించి అన్ని గుర్తించే అవకాశం ఉంటుందని ఫీడ్ బ్యాక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ చైర్మన్ వినాయక్ చట్టర్జీ చెప్పారు. భూ స్థలాలకు సంబంధించిన మొత్తం డేటాను ప్రభుత్వం డిజిటిలైజేషన్ చేస్తోందని అన్నారు. 

ఈ కొత్త వ్యవస్థ ద్వారా స్థలానికి సంబంధించి పాత యజమాని ఎవరో కూడా ఈజీగా ట్రేస్ చేయవచ్చు. తద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు దోహపదడుతుందని చెప్పారు. ఇండియాలోని స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులను కూడా ఆకర్షించేందుకు వీలుగా ఉంటుందని ఆయన అన్నారు. స్థలం రికార్డులు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డిజిటిలైజేషన్ చేసేందుకు వీలుగా ఇప్పటికే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రొగ్రామ్ ను ప్రభుత్వం అమలు చేస్తోంది.    

lands
Aadhaar
unique ID numbers
ownership account
Land disputes

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు