Sonu Sood arranges chartered flight to ferry Odisha migrants from Kerala

 వలస కార్మికుల కోసం సోనూసూద్ ప్రత్యేక విమానం ఏర్పాటు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోనూ సూద్ శుక్రవారం మరో అడుగుముందుకేశారు. వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సొంతూళ్లకు పంపిస్తున్న సూద్.. కేరళలో ఇరుక్కుపోయిన 147మంది మహిళలు, 20పురుషులకు ఎయిర్ ఏసియా విమానాన్ని బుక్ చేశాడు. కొచ్చి నుంచి భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు శుక్రవారం చేరుకుంది. 

‘నేను వలస కార్మికులకు సాయం చేయాలని అనుకున్నప్పుడు.. నా మైండ్ లో ఒకటే ఆలోచన ఉంది. వారి కుటుంబాలను ఒక చోటికి చేర్చాలి’ అని సోనూ సూద్ ఓ స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. విమాన సర్వీసు వెంటనే స్పందించి సాయం చేసేందుకు ముందుకువచ్చిందని థ్యాంక్స్ చెబుతున్నాడు. 

‘సోనూసూద్ గారి ఉదారత, జాలి గుణం వలస కార్మికులపై ఆయన చూపిస్తున్న ప్రేమ అద్భుతం. 167మంది విమానంలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో 147మంది మహిళలే. వారంతా ఓ వస్త్ర పరిశ్రమలో కూలీలు’ అని ఎయిర్ ఏసియా ఇండియా హెడ్ అనూప్ మంజేశ్వర్ అన్నారు. 

రాజ్యసభ ఎంపీ అమర్ పట్నాయక్, సినిమా సెలబ్రిటీలు సోనూసూద్ ను పొగిడేస్తున్నారు. ఆ కూలీలు సోనూసూద్ మాకు ఏర్పాట్లు చేయడం వల్లనే ఇన్ని నెలల తర్వాత సొంతూళ్లకు తిరిగొచ్చాం. ఆయనకు థ్యాంక్స్. అంటూ కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 

Related Posts