దేశంలోని ముస్లింలందరినీ పాక్ పంపించాలి...సుప్రీంలో పిటిషన్

Submitted on 15 March 2019
Someone Wanted To Send All Indian Muslims To Pakistan, Supreme Court Taught Him A Lesson For Life

దేశంలో ఎవరైనా,ఏ స్థాయిలో ఉన్న ముస్లిం వ్యక్తి అయినా బీజేపీని,ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే..అలాంటివారిని పాక్ కు పంపించాలంటూ గతంలో కొన్ని సార్లు పలువురు అతివాద వ్యక్తులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్,షారుఖ్ ఖాన్,మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ కేసుల్లో గతంలో ఇలా జరగడం మనం చూశాం. అయితే కేవలం కొంతమంది అతివాద వ్యక్తులు మాత్రమే ఇలాంటి నినాదాలు చేయలేదు.కొంతమంది బీజేపీ హైప్రొఫైల్ లీడర్లు ఎంపీ సాక్షిమహరాజ్,ఎమ్మెల్యే విజయ్ వర్గియ,వీహెచ్ పీ లీడర్ సాధ్వీ ప్రాచీలు ముస్లింలందరూ పాక్ వెళ్లాలని,తాము వారికి టిక్కెట్లు కొనిస్తామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలోని ముస్లింలందరినీ తాను చట్టబద్దంగా పాక్ కు పంపిస్తానని ఇప్పుడు ఓ యువకుడు ఏకంగా కోర్టుకెళ్లాడు.
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం

భారతదేశంలోని ముస్లింలందరినీ చట్టబద్దంగా పాకిస్తాన్ కు పంపించాలని కోరుతూ ఓ యువకుడు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశాడు. శుక్రవారం(మార్చి-15,2019) జస్టిస్ రోహిన్టన్ నారీమణ్,జస్టిస్ వినీత్ శరణ్ లతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా...జస్టిస్ నారీమణ్ అప్ సెట్ అయినట్లు కన్పించారు. పిటిషన్ లోని విషయాన్నిపెద్దగా చదవాలని పిటిషన్ తరపు న్యాయవాదిని కోరాడు. లాయర్ దానిని చదవడం పూర్తి అయిన తర్వాత..మీరు సీరియస్ గా దీనిని వాదించాలనుకుంటున్నారా?మీ వాదనలు వింటాం కానీ మీకు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తామని నారీమణ్ అన్నారు. దీంతో ఖంగుతిన్న లాయర్ వద్దు మై లార్డ్ అంటూ వేడుకున్నాడు.పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు నారీమణ్ ప్రకటించారు.

అయితే కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్ పై ఎటువంటి ఫైన్ ను కోర్టు విధించకపోవడం విశేషం. గతంలో ఇలాంటి పిటిషనర్ల విషయంలో కోర్టు విలువైన సమయాన్ని పిల్ ల పేరుతో వృథా చేస్తున్నారంటూ ఆ పిటిషనర్లను మందలించడం,వారికి జరిమానాలు విధించిన విషయం తెలిసిందే.   
Read Also: మాయావతి ప్రధాని కావాలి...బీఎస్పీతో పొత్తు ఉందన్న పవన్

Send
All Indian Muslims
Pakistan
Supreme Court
lesson
PIL
no
fine
nariman
upset
strictures
petitioner
BJP
Protest
Leaders

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు