సరిహద్దుల్లో శ్రీకాకుళం జవాను మృతి 

Submitted on 26 May 2019
A soldier died in border from srikakulam

భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాను చనిపోయారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సరియాపల్లి పంచాయతీ చిన్నబహడపల్లి గ్రామానికి చెందిన బత్తిన తిరుపతిరావు(25) సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆర్మీ జవానుగా ఎంపికైన తిరుపతిరావు జమ్ము, కశ్మీర్‌లో విధుల్లో చనిపోయినట్లు కుటుంబీకులకు సమాచారం అందించారు.

తిరుపతిరావుకు తండ్రి భాస్కరరావు, తల్లి మోహినమ్మ, తమ్ముడు భగవాన్‌ ఉన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆయన మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. తిరుపతిరావు మృతికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే తిరుపతిరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 

SOLDIER
Border
Srikakulam

మరిన్ని వార్తలు