సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోవడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Submitted on 9 April 2020
software employ commits suicide

హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సహజీవనం చేసిన యువతి వదిలి వెళ్లిపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేక నేను లేను, నాకీ జీవితం వద్దు అంటూ చనిపోయాడు. మృతుడి పేరు చంద్రకిరణ్‌ (32). మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కిరణ్ ఓ యువతితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 

బేగంపేటలో నివాసమున్న చంద్రకిరణ్‌ ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌కు మకాం మార్చాడు. 25 రోజుల క్రితం ఆ యువతి చంద్రకిరణ్‌ను వదిలి వెళ్లిపోయింది. దీంతో కిరణ్ మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం సోదరుడు రాకేష్‌ కిరణ్ కు ఫోన్ చేశాడు. అయితే కిరణ్ ఫోన్‌ ఎత్తలేదు. చాలాసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. దీంతో రాకేష్ కి అనుమానం వచ్చింది. వెంటనే రూమ్ కి వెళ్లి చూడగా షాక్ తిన్నాడు. కిరణ్ విగతజీవిగా కనిపించాడు. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. ‘ఆ అమ్మాయి లేనిదే నేను బతకలేను’ అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

See Also | కరోనా వ్యాక్సీన్ వచ్చేంతవరకు లాక్‌డౌన్లు కొనసాగాల్సిందే : కొత్త అధ్యయనం ఇదే తేల్చింది!

Hyderabad
Software employ
Suicide
love failure
begumpet

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు