పోలింగ్ శాతం 100 దాటిపోతుంది...ఈమె ఎవరో తెలుసా!

Submitted on 12 May 2019
social media celebrity reena dwivedi

రెండు చేతుల్లో EVM పట్టుకుని  పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీర ధరించి..సన్ గ్లాసెస్ పెట్టుకుని..ఓ చేతిలో ఈవీఎంతో పాటుగా యాపిల్ ఫోన్ పట్టుకుని... మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో..పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న యువతి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఓవర్ నైట్ లో ఆ యువతి  సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. అయితే ఆమె ఎవరు అనేదానిపై చాలామందిలో ఆసక్తి ఏర్పడింది.

ఆమె పేరు రీనా ద్వివేది. ఉత్తర్ ప్రదేశ్ లో PWD విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తుంది. ఎన్నికల వేళ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 50కిలోమీటర్ల దూరంలోని  నగ్రామ్ 173 పోలింగ్ బూత్ లో మే-5,2019న ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ కెమెరాలను ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను చూసిన వారంతా.. ఆ పోలింగ్ బూత్ లో 100శాతంకు మించి  పోలింగ్ నమోదవుతుందని,ఇలాంటి వాళ్లు పోలింగ్ బూత్ లో ఉంటే యువత ఓటు ఒక్కటి కూడా మిస్ కాదని కామెంట్స్ చేస్తూ ఫొటోను సోషల్ మీడియాలో ఫేర్ చేశారు.దీంతో ఓవర్ నైట్ లో రీనా  సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది.

ఇదే విషయం రీనా ద్వివేదిని అడిగితే.. ‘ఔను చాలామందే వచ్చారు.. మా పోలింగ్ బూత్ లో 70 పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఒక్కరోజులో దేశమంతటా హైలైట్ కావడం సంతోషంగా ఉందన్నారు. చాలామంది ఇపుడు తనను సెల్ఫీలు అడుగుతున్నారని రీనా తెలిపారు. 

social media
reena dwivedi
Saree
loksabha elections
UP
Percentage
polling

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు