రూ.3899 కే స్మార్ట్ ఫోన్

Submitted on 22 October 2019
Smartphone for Rs.3899 launch

మార్కెట్ లోకి రూ.3వేల 899 కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’  పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం (అక్టోబర్ 22, 2019) లాంచ్‌ చేసింది. దీని ధర రూ.3వేల 899గా ఉంది. మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌ రంగుల్లో ఇది లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలతో వినియోగదారుల అన్ని సోషల్ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్ గో వంటి డేటా యాప్ప్‌ సర్ఫింగ్‌కు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.  

స్పెసిఫికేషన్ల పరంగా, 9 లెవల్ ఫిల్టర్లు, నైట్ షాట్, స్మార్ట్ స్లీప్, బర్స్ట్ మోడ్ ఎఫెక్ట్‌తో పాటు రియల్ టైమ్ బోకె ఫీచర్లతో రూ. 4వేల విభాగంలో ఉన్న ఏకైక స్మార్ట్‌ఫోన్ ఇదేనని లావా ఇంటర్నేషనల్ హెడ్ (ప్రొడక్ట్) తేజిందర్ సింగ్  వెల్లడించారు. 

  • 5 అంగుళాల డిస్‌ప్లే 
  • ఆండ్రాయిడ్ 9 పై (గో ఎడిషన్)
  • 5 ఎంపీ రియర్‌ కెమెరా
  • 1 జీబీ ర్యామ్‌, 16జీబీ  స్టోరేజ్‌
  • 2500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
     
smartphone
Rs.3899
Launch
Delhi

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు