అమ్ముడుబోని కార్లు : ప్రొడక్షన్ నిలిపివేసిన ఆటో కంపెనీలు

Submitted on 10 June 2019
Slowdown Sales: Auto companies halt production as unsold vehicles pile up

ఇండియా ఆటో సెక్టార్ లో వెహికల్స్ సేల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దేశీయంగా వాహనాల సేల్స్ డిమాండ్ మందగించడంతో డీలర్ల దగ్గర అమ్మడుబోని వాహనాల జాబితా భారీగా పెరిగిపోయింది. ఇండియాలోని టాప్ ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్రవాహనాల తయారీ కంపెనీలు సంచలన నిర్ణయాన్ని ప్రకటించాయి.  ప్రస్తుత త్రైమాసిక సమయంలో వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించాయి.

మార్కెట్ బలహీనపడిన కారణంగా అమ్ముడుబోని వాహనాల భారం తగ్గించుకునేందుకు కంపెనీలు వెహికల్స్ ప్రొడక్షన్ షట్ డౌన్ చేయడమే సరైనదిగా భావించాయి. ఈ నిర్ణయంతో.. ఇండియన్ ఆటో రంగంలోని ఉత్పత్తులు, వృద్ధి లక్ష్యాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆటో సెక్టార్ లో కనీసం టాప్ 10 ప్యాసింజర్ వెహికల్ తయారీ కంపెనీల్లో ఏడు కంపెనీలు మే నెల, జూన్ నెల మధ్యలో తమ ఉత్పత్తులను ఆపివేస్తున్నట్టు ప్రకటించినట్టు ఓ నివేదిక తెలిపింది.

మారుతి సుజూకీ, టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీలు కూడా మే నెలలో కొన్ని రోజుల పాటు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. హోండా కార్స్ ఇండియా, స్కోడా ఆటో, రెనాల్ట్ -నిస్సాన్ అలియన్స్ ఆటో మేకర్లు కూడా జూన్ నెలలో మరో పది రోజుల్లో తమ ఉత్పత్తులను నిలిపివేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 

మారుతి సుజూకీ, హోండా కార్స్ ఇండియా, స్కోడా అండ్ రెనాల్డ్-నిస్సాన్ కూడా తమ వాహనాల ఉత్పత్తులను షట్ డౌన్ చేసేందుకు ప్లాన్ చేశాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం సమయంలో ఐదు నుంచి 13 రోజుల వరకు ‘నో ప్రొడక్షన్ డేస్’ పేరుతో పరిస్థితులను మహీంద్ర వెహికల్ మ్యానిఫాక్చరర్స్ ప్రొడక్షన్ యూనిట్ గమనించనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్, మహీంద్ర అండ్ మహీంద్ర భావిస్తున్నట్టు నివేదిక తెలిపింది. 

దేశ వ్యాప్తంగా ఆటో సెక్టార్ లో సేల్స్ నెమ్మదిగా దిగిపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేయడం ప్రారంభించాయి. జూన్ ఆరంభంలో సగానికిపైగా మిలియన్ల ప్యాసింజర్ వెహికల్స్ విలువ 5 బిలియన్ల డాలర్లు ఉండగా.. 2.5 బిలియన డాలర్ల విలువైన 3 మిలియన్ల ద్విచక్రవాహనాలు డీలర్ల దగ్గర అమ్ముడుబోలేదని డెయిలీ రిపోర్ట్ పేర్కొంది. ఆటో పరిశ్రమలో ఉత్పత్తులను నిలిపివేయడంతో మే-జూన్ సమయంలో 20 నుంచి 25 శాతం ఇండస్ట్రీ ఔట్ ఫుట్ తగ్గిపోయిందని తెలిపింది.

దీంతో వాహనాల డీలర్లకు భారీ ఉపశమనం లభించనట్టయింది. ఉద్యోగ వృద్ధి నెమ్మదించడం, ఇంధన ధరలు పెరగడం, ద్రవ్య సంక్షోభం కారణంగా NBFC సెక్టార్ లో దేశీయ డిమాండ్ బలహీనపడేందుకు దారి తీసింది. మే నెలలో చాలా కంపెనీల్లో సేల్స్ పడిపోవడానికి ఇదే కారణమైందని నివేదిక వెల్లడించింది. 

Slowdown sale
Auto companies
halt production
unsold vehicles

మరిన్ని వార్తలు