చుక్ చుక్ : నిజాం రైల్వే తొలితరం ఇంజన్

Submitted on 15 March 2019
Sir Alec the Heritage Steam Locomotive old rail engine

సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా నుండి మెట్టుగూడ దారి గుండా వెళ్లే వారు ఓ దానిపై నజర్ పడుతుంది. రైల్ నిలయం దగ్గర దర్జాగా ఓ రైలు ఉంటుంది. నిజాం స్టేట్ రైల్వేలో తొలి తరం రైలింజనే ‘సర్ అలెక్’ లొకో మోటివ్. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆవిర్భావించాక దాని కేంద్ర కార్యాలయం రైల్ నిలయం ఎదుట దీనిని ఏర్పాటు చేశారు. దీనికి అందంగా పేయింటింగ్ వేయించి అందంగా తీర్చిదిద్దారు. 
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం

1907లో ఇంగ్లండ్‌కు చెందిన ‘కిట్సన్ అండ్ కో’ దీనిని రూపొందించింది. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్ నుండి వాడీ మధ్య ప్రారంభమైన తొలి మార్గంలో ఈ ఇంజిన్ పరుగుపెట్టింది. పిక్కటిల్లేలా కూత, పొగ మంచు, నల్లటి పొగతో చుక్ చుక్ అంటూ ఇది వెళుతుండేది. కొన్ని దశాబ్దాల పాటు సేవల అందించిన ఈ రైలును సర్వీసుల నుండి తొలగించారు. ఇప్పుడు ఇది పట్టాలపై పరుగులు తీస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని కలిగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాంకేతిక సమస్యలు తొలగించి ఇంజిన్ ఆన్ అయ్యేలా చేశారు. కొన్ని దశాబ్దాల కిందటి రైలును కళ్లారా చూసినట్లే అనిపిస్తుంది. మార్చి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ ఇంజిన్ పనిచేసేలా కృతిమ ఏర్పాటు చేశారు. 

Sir Alec
Heritage
Steam
Locomotive
old rail engine
Secunderabad
Mettuguda
Railway News

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు