ఆకట్టుకుంటున్న ‘సింగిడిలో బతుకమ్మ’ పాట

Submitted on 22 October 2019
Singidilo Bathukamma Song - 2019

బతుకమ్మ.. పుడమిపై పూల వాన కురిసే పండుగ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంప్రదాయంగా, అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ.. బతుకమ్మ సంబరాల్లో ఆడవారి ఆట పాటలది ప్రత్యేక స్థానం.. బతుకమ్మ కోసమే పలువురు కవులు, కళాకారులు ప్రత్యేకంగా పాటలు రూపొందిస్తుంటారు. అలా రూపొందించిన ‘సింగిడిలో బతుకమ్మ’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

‘తిమ్మారాజు’, ‘కాళీచరణ్’ వంటి పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన నందన్ రాజ్ బొబ్బిలి ట్యూన్ కంపోజ్ చేయగా, అక్షరం ప్రభాకర్ బతుకమ్మ విశిష్టతను తెలియచేస్తూ అందమైన పదాలు రాశారు.. బెల్లి రామకృష్ణ, మౌనిక చక్కగా పాడారు. కుందారపు సాయి తేజ ఫోటోగ్రఫీ, కందుకూరి అనిల్ కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. బెల్లి గోపిచంద్, బెల్లి దిలీప్ నిర్మించారు.

Read Also : ‘కట్ చేస్తే’ - ఆలోచింపచేస్తున్న షార్ట్ ఫిలిం..

‘సింగిడిలో బతుకమ్మ’ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. సంగీతం : నందన్ రాజ్ బొబ్బిలి, లిరిక్స్ : అక్షరం ప్రభాకర్, సింగర్స్ : బెల్లి రామకృష్ణ, మౌనిక, డీఓపి, ఎడిటింగ్ : కుందారపు సాయి తేజ, కొరియోగ్రఫీ : కందుకూరి అనిల్, కో-ఆర్డినేటర్ : జంగం ఉపేందర్, జాగతి శ్రీకాంత్ (చిన్నగూడూర్), లొకేషన్ అరేంజర్స్ : బదావత్ చందు, మద్దినాల మధు..

Nandhan Raj Bobbili
Aksharam Prabhakar
Belli Ramakrishna
Macha Mounika
Kandukuri Anil
Belli Gopichand
Belli Dileep

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు