బిగ్ బాస్ ఎలిమినేషన్: నాగార్జున సీరియస్.. యాంకర్ శిల్పా అవుట్!

Submitted on 14 September 2019
Silpa Chakravarthy Eliminated from Bigg Boss Telugu3!

సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 3' షో ఈసారి మాత్రం సంచనాలు పెద్దగా లేకుండా సరదాగా.. కాస్త భావోద్వేగంగా సాగుతుంది. విజయవంతంగా రన్ అవుతూ 8వారాలు పూర్తిచేసుకుంది బిగ్ బాస్ షో. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇప్పటికే తెలిసిపోయింది. అనధికారికంగా తెలుసిన విషయం ఏంటంటే అందరూ అనుకున్నట్లుగానే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ శిల్పా చక్రవర్తి ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది.

ఈ మధ్యే 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న షోలో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కు వచ్చేసింది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్ప చక్రవర్తి నామినేషన్ లిస్టులో ఉండగా.. శిల్పా ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి ఎవరితోనూ కలిసిపోకపోవడం.. ఆమె మీద ప్రేక్షకులకు సాఫ్ట్ కార్నర్ లేకపోవడం కారణంగా ఆమె ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు. 

అంతేకాదు శనివారం ఎపిసోడ్ కాస్త హాట్ గానే సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.  ఇవాళ వాతావరణం బయట చల్లగా ఉన్నా బిగ్ బాస్ లో మాత్రం హాట్ గా ఉండబోతుంది. అని విడుదలైన ప్రోమోతో చెప్పేశారు నిర్వాహకులు. శనివారం ప్రసారం అయ్యే షోలో ఎంట్రీ ఇస్తూనే హోస్ట్ నాగార్జున ఇవాళ నో సాంగ్.. నో డాన్స్.. అందరూ లోపలికి వెళ్లిపోండి అంటూ కాస్త సీరియస్ గా చెప్పేశారు. పీకల దాక కోపం ఉంది అంటూ ప్రోమోలో కాస్త సీరియస్ గానే ఉన్నట్లు కనిపించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వాళ్లతో చాలా మాట్లాడాలి అని అన్న తీరుని బట్టి బిగ్ బాస్ కాస్త హాట్ గా ఉండేట్లు కనిపిస్తుంది. 

Bigg Boss Telugu
Bigg Boss Telugu 3
Nagarjuna
Silpa Chakravarthy

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు