Sikkim integral Part Of India cm Kejriwal

సిక్కిం మరో దేశమా : తప్పును సరిదిద్దుకున్న ఢిల్లీ సర్కార్..అధికారి సస్పెండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సిక్కిం మరో దేశమంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సీఎం కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై బీజేపీ మండిపడింది. సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. చేతులు కాలాకా..ఆకులు పట్టుకున్న చందంగా…తప్పును సరిదిద్దుకుంది. దీనికి కారణమైన అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 2020, మే 24వ తేదీ ఆదివారం సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 

హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే..ఈ ప్రకటన జారీ చేశామని ఆప్ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నొటిఫికేషన్ లో తప్పిదానికి కారణమైన డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారిని విధుల నుంచి తొలగించామన్నారు. ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని తొలగించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా 1975, మే 16వ తేదీన సిక్కిం అవతరించిన సంగతి తెలిసిందే. 

సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్ లో వాలంటీర్లుగా చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సిక్కిం ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇది ఘోరమైన తప్పిదమని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.