దేవుడు చేసిన మనిషేనా? ఏలియన్ పుత్రుడా? : హార్ట్ రైట్‌లో.. లివర్ లెఫ్ట్‌లో.. అవయవాలన్నీ రాంగ్ సైడ్

Submitted on 3 October 2019
Shocking! 'Heart on right, liver on left'; this UP man has all organs on wrong side

కుడి.. ఎడమ అయితే పొరపాటు లేదోయో.. ఓడి.. పోలేదోయ్ అంటారు. అవును... ఇది నిజమే.. దేవుడు చేసిన పొరపాటో లేదా ఏలియన్ ప్రతి సృష్టో తెలియదు కానీ, ఓ వ్యక్తి శరీరంలో అవయవాలన్నీ రాంగ్ సైడ్ లో ఉన్నాయి. ప్రతి మనిషిలో సాధారణంగా అవయవాలన్నీ ఒకేలా ఉంటాయి. ఒకే స్థానంలో ఉంటాయి. బయటకు కనిపించే అవయవాలతో పాటు లోపల అవయవాలు కూడా ఒకే స్థితిలో ఉంటాయి. జన్యపరమైన సమస్యలతో పుట్టిన వారిలో మాత్రం కాస్త అవయవాలు అతుకుని ఉండటం కూడా సర్వసాధారణం.

మనిషిలో ఒక్కో అవయవం ఒక్కో స్థానంలో ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు అన్ని అవయవాలు వాటి స్థానంలో ఉంటాయి. శరీరం లోపల, బయట ఒకే స్థితిలో కనిపిస్తాయి. కానీ, ఒక మనిషిలో ఉండాల్సిన ప్రధాన అవయవాలు వ్యతిరేక దిశలో ఉండటం ఎప్పుడైనా విన్నారా? పోను చదివారా? అయితే ఇప్పుడు చదవండి..

ఉత్తర ప్రదేశ్ లోని పద్రాణా ప్రాంతానికి చెందిన జమాలుద్దీన్ అనే వ్యక్తి శరీరంలోని అవయవాలన్నీ అపసవ్య దశలో ఉన్నాయి. అందరికి గుండె ఎడమ వైపు పైభాగంలో ఉంటుంది.. లివర్ కుడి వైపు పైభాగంలో ఉంటుంది. కానీ, యూపీ వ్యక్తికి మాత్రం గుండె కుడి భాగంలో ఉంటే.. లివర్ ఎడమ భాగంలో ఉంది. 

గుండె.. లివర్ మాత్రమే కాదు.. అంతర అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉండటం అందరికి వింతగా అనిపిస్తోంది. పరీక్షించిన వైద్యులు కూడా షాక్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం జమాలుద్దీన్ కు కడుపులో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు అతడ్ని గోరఖ్ పూర్ లోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్ -రే, అల్ట్రా సౌండ్ టెస్టు నిర్వహించారు. రిపోర్టులో ఆర్గాన్స్ అన్ని రాంగ్ సైడ్ లో ఉండటం చూసి కంగు తిన్నారు. బరియాట్రిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ శశికాంత్ దీక్షిత్ మాట్లాడుతూ.. ‘పిత్తాశయంలో స్టోన్స్ ఉండటం గుర్తించాం. 

ఒకవేళ పిత్తాశయం ఎడమ వైపు ఉన్నట్టు అయితే ఆ రాళ్లను తొలగించడానికి చాలా కష్టంగా ఉండేది. మూడు పరిమాణాల ల్యాప్రోస్కోపిక్ మిషన్ల సాయంతో సర్జరీ చేసి రాళ్లను తొలగించాం’ అని చెప్పారు. ప్రస్తుతం.. జమాలుద్దీన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. ఒక మనిషి శరీరంలోని అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉండటం ఇదే తొలిసారి అని అన్నారు. ఇలాంటి అరుదైన ఘటన 1643 ఒకసారి వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రత్యేకించి శస్త్రచికిత్స సమయాల్లో ఇలాంటి వ్యక్తులకు చికిత్స చేయడం చాలా కష్టమైన పనిగా దీక్షిత్ చెప్పారు. 

Heart on right
liver on left
UP man
all organs
Wrong Side
Uttar Pradesh
Kushinagar
Padrauna 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు