ధావన్ ఇండియా వస్తే టోర్నీకి దూరమైనట్లే..

Submitted on 12 June 2019
Shikhar Dhawan to Remain in England With No Replacement

ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. బ్యాండ్ ఎయిడ్‌తోనే బ్యాటింగ్ చేసి(117)పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. కానీ, ఫీల్డింగ్ చేయలేకపోవడంతో రవీంద్ర జడేజా బాధ్యత తీసుకుని 50ఓవర్లు ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ తర్వాత ఫిజియోల సూచన మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

అందులో ధావన్‌కు 3వారాల విశ్రాంతి తప్పదని చెప్పడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ధావన్‌ను ఇండియా పంపేయాలనుకుని మళ్లీ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ధావన్‌ను ఇండియాకు పంపేస్తే మళ్లీ అతణ్ని జట్టులోకి తీసుకోవడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు. అలా ఒక ఆటగాడిని గాయం కారణంగా తప్పిస్తే టోర్నీ నుంచి శాశ్వతంగా తప్పించాలి. 

కానీ, బీసీసీఐ దీనికి సమ్మతంగా లేకపోవడంతో ధావన్‌ను ఇంగ్లాండ్‌లోనే ఉంచి చికిత్స అందించనుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు మాత్రం ధావన్ కచ్చితంగా విశ్రాంతి అవసరమని చెప్పడంతో ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. 

ధావన్ ఎడమ చేతి వాటం కలిగిన బ్యాట్స్‌మన్ కావడంతో అతని స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి చేరతాడని వచ్చిన ఊహాగానాలన్నింటికీ బ్రేక్ పడింది. ముందుగా ప్రకటించిన 15మంది జట్టు సభ్యులతోనే టోర్నీ ఆడేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు చేస్తుంది. 

shikhar dhawan
england
dhawan
Team India
2019 icc world cup
world cup 2019

మరిన్ని వార్తలు