21 సాయంత్రం షీలా దీక్షిత్ అంత్యక్రియలు

Submitted on 20 July 2019
Sheila Dikshit dies: Delhi govt announces 2-day mourning, state funeral for Cong leader

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ (81) అంత్యక్రియలు ఆదివారం జులై 21  జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 20 శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆమె పార్ధివ దేహాన్ని నిజాముద్దీన్లోని ఆమె నివాసానికి తరలించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. 

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె పార్ధివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలిస్తారు.మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యకర్తల సందర్శనార్ధం అక్కడ ఉంచుతారు. అనంతరం యాత్రగా బయలుదేరి సాయంత్రం నిగమ్ బోధ్ ఘాట్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

మరోవైపు తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు నిజాముద్దీన్ లోని షీలా దీక్షిత్ నివాసానికి రావటంతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీకి చెందిన వారేకాక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించేందుకు తరలి వస్తుండటంతో పోలీసులు ఆప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

state funeral
Delhi
Congress
Sheila Dikshit

మరిన్ని వార్తలు