సూపర్ ఓవర్లో గెలవకపోవడం సిగ్గుచేటు: సన్‌రైజర్స్ కెప్టెన్

Submitted on 3 May 2019
Shame didn't won Super Over: Kane Williamson

ఉత్కంఠభరితమైన పోరులో కొద్దిపాటి వ్యత్యాసంతో ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి గురైంది. లక్ష్య చేధనకు దిగి మ్యాచ్ టైగా ముగించిన సన్‌రైజర్స్‌కు సూపర్ ఓవర్లో ఓటమి తప్పలేదు. మ్యాచ్ ఆసాంతం మనీశ్ పాండే వీరోచిత పోరాటం చేసినా ఫలితం దక్కకుండా పోయింది. 

ఈ ప్రదర్శన పట్ల హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. 'సూపర్ ఓవర్లో ఓడిపోవడం సిగ్గుగా అనిపిస్తుంది. నేను సూపర్ ఓవర్లలో చాలాసార్లు ఆడాను. కొన్ని సార్లు ఫెయిల్ అయ్యాం. టార్గెట్ చేధించే క్రమంలో మనీశ్.. నబీలు అద్భుతంగా రాణించారు.  ముంబై ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయగలిగారు'

'సూపర్ ఓవర్లో ఎన్ని పరుగులు చేస్తామా.. అని ఆలోచించాం. 8పరుగులే చేయడంతో వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన రషీద్‌తో బౌలింగ్ వేయించాలని అనుకున్నాం. ఇంకా గ్రూప్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అందులోనూ అదే తరహాలో ఆడాలని అనుకుంటున్నాం' అని సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించాడు. 

ఐపీఎల్ 2019సీజన్లో హైదరాబాద్ 13మ్యాచ్‌లు ఆడి 12పాయింట్లు సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో ఏప్రిల్ 4వ తేదీ గ్రూప్ దశలోని తన చివరిమ్యాచ్‌ను ఆడనుంది సన్‌రైజర్స్.

kane williamson
sunrisers hyderabad
IPL 2019
IPL 12
srh

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు