క్రూయిజ్ షిప్‌లో పెరుగుతున్న భారత కరోనా పేషెంట్లు

Submitted on 20 February 2020
Seventh Indian tests positive for coronavirus on quarantined cruise ship

భారత విదేశీ ప్రయాణికుల్లో మరొకరికీ కరోనా వైరస్ సోకిందని వైద్యులు తేల్చారు. టోక్యోలో ఉన్న ఎంబస్సీ.. వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారంతో ఏడుగురు భారతీయులకు వైరస్ సోకినట్లు చెప్పారు. వీరందరినీ ట్రీట్‌మెంట్ కోసం జపాన్‌కు తరలించారు. 

బుధవారం జరిపిన పరీక్షల్లో 88కేసులు నమోదు కాగా, భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిలో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. అందరికీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నామని వారి పరిస్థితి కుదుటపడిందని వైద్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ప్రయాణికులను ఒకొక్కరిగా దింపేయనున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించింది ఇండియన్ ఎంబస్సీ. 

జపాన్‌లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3వేల 700 ప్రయాణీకులతో పాటు  సిబ్బంది ఉన్నారు.  వీరిలో 138 భారతీయులు. 136 మంది సిబ్బంది కాగా ఆరుగురు సాధారణ ప్రయాణికులు ఉన్నారు. వైద్యుల నిర్బంధంలో కాలం గడుపుతున్న వారిలో రోజురోజుకూ కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

india
coronavirus
cruise ship
Corona

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు