seeing the problems of the migrants one decided to volunteer Jharkhand man

వలస కూలీల కష్టం తీరాకే ఇంటి కెళతా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కష్టంలో ఉన్నవాళ్లను ఆదుకున్నవాడు మనిషి అయితే..తాను కష్టాల్లో ఉండి కూడా తోటివారి కష్టాలను అర్థం చేసుకుని..వాళ్లకు సహాయం చేయటాన్ని ఏమంటారు. మహామనిషి అనాలి. కరోనా కల్లోలం వేళ లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కష్టాల్లో ఉండే వలస కూలీలకు ఎంతోమంది సహాయం చేస్తూ..తమ దాతత్వాన్ని చాటుకుంటున్నారు.

కానీ తాను కష్టంలో ఉండి కూడా తోటి వలసకూలీలకు అండగా నిలబడాలనుకున్నాడు జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లా నివాసి అయిన 48ఏళ్ల  అజిత్ లోచన్ మిశ్రా. పరోపకారం ఇదం శరీరం, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు పెద్దలు.దాన్నే నమ్మాడేమో  అజిత్.   లాక్ డౌన్ కష్టాలతో తాను కూడా తన సొంత ఊరు వెళదామని బయలుదేరి తోటి వలస కూలీల కష్టాలు చూసి వారికి సేవ చేస్తూ అక్కడే ఉండపోదామనుకున్నాడు. 

లాక్‌డౌన్‌ కారణంగా వ‌ల‌స కూలీలు ఇంటి బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. అలా..జార్ఖండ్‌లోని తన గ్రామానికి వెళ్ల‌డానికి బ‌య‌లుదేరిన అజిత్ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సేదదీరుతూ..ఆశ్రయం పొందుతున్న వ‌ల‌స కూలీల అవ‌స్థ‌లను గ‌మ‌నించాడు. వారి ఇబ్బందులు చూసి చలించిపోయాడు. బొబ్బలు తేలిని కాళ్లతో వందల కిలోమీటర్లు నడిచివెళ్లే తనలాంటి వలస కార్మికుల వెతలు చూసిన అజిత్ గుండె కరిగిపోయింది. 

అంతే…తన సొంత ఊరికి వెళ్లటానికి బయలుదేరిన అజిత్ వలస కూలీల కష్టాలు తీరేవారకూ..తాను ఇంటికి వెళ్ల కూడ‌ద‌ని..వ‌ల‌స కూలీల‌కు సేవచేస్తూ అక్కడే ఉండిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. గత కొన్నిరోజులుగా కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్‌లో ఆహారం పంపిణీలో వలంటీర్‌గా సేవ‌లందిస్తున్నాడు.

ప‌రిస్థితులు మెరుగుప‌డి వలస కూలీలందరూ షెల్ట‌ర్ హోం విడిచిపెట్టి..వారి వారి సొంత ఊర్లకు చేరుకున్న త‌రువాత‌నే తాను త‌న గ్రామానికి  వెళ్తానని అజిత్ అన్నాడు. లాక్‌డౌన్ తో నేను కూడా చాలామంది వలస కూలీల వలెనే ఉపాధి కోల్పోయాను. ఈ క్రమంలో మా ఊరికి వెళ్లిపోదామని బయలుదేరాను. 

అలా బయలుదేరిన నేను కూడా చాలామంది బాధితుల్లాగనే..యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వచ్చాను. ఇక్కడి వ‌ల‌స కూలీల పరిస్థితి చూసి..వారికి సాయం అందించేందుకు వ‌లంటీర్‌గా చేరిపోయాన‌ని అన్నాడు అజిత్ మిశ్రా. నాతోటివారికి నాకు చేతినైనంత సాయం అందిస్తున్నాన‌ని తెలిపారు. 

చూశారా..కరోనా..కరోనా కష్టాలు అని అనుకుంటున్నాం..కానీ మనిషిలో ఉండే మానవత్వం ఎలా బైటపడుతోందో. చిన్న చిన్న కారణాలకే తోటి మనిషి ప్రాణాలు తీస్తున్న ఈ సమాజంలోనే అవసరమతే..తమ కష్టాల్ని కూడా లెక్క చేయకుండా..సహాయం చేసే మనస్సులెన్నో..ఆదరణ చూసే చేతులెన్నో..తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా..కరోనా రోగులకు సేవలందించే డాక్టర్లు..నర్సులు..వైద్య సిబ్బంది ఇలా ఎంతోమంది బాధితులకు మేమున్నాం అంటున్నారు. ఈ భరోసా సరిపోదూ..కరోనాలాంటి మహమ్మారితో పోరాడటానికి..

Read: కర్ణాటకలో ‘కరోనా’ అమ్మవారు: గ్రామస్తుల పూజలు..ఊరేగింపులు