మొబైల్ పేమెంట్స్ ఎంతో ఈజీ : SBI Card Pay ఫీచర్ వచ్చేసింది

Submitted on 17 October 2019
SBI Card Holder? Bank launches contactless mobile phone payments SBI Card Pay

మీరు ఎస్బీఐ (క్రెడిట్) కార్డుదారులా? మీకో గుడ్ న్యూస్. మీరు ఎక్కడికి వెళ్లినా? షాపింగ్ చేసినా స్వైప్ చేయక్కర్లేదు. మీ పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. కార్డు స్వైప్, పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్స్ ఈజీగా చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది ఎస్బీఐ. అదే.. ‘SBI Card Pay’ పేరుతో కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఫీచర్ ప్రవేశపెట్టింది. మీ మొబైల్ ఫోన్లతో పాయింట్ ఆఫ్ సేల్స్ (PoS) మిషన్ల దగ్గర కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై Wi-Fi సింబల్ ఉన్న కార్డులను కాంటాక్ట్ లెస్ కార్డులు అంటారని తెలిసిన విషయమే. 

ఈ కార్డులతో నీయర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) ఎనేబుల్ అయిన పాయింట్ ఆఫ్ సేల్ (PoS)టెర్నినల్స్ దగ్గర ఫిజిల్ క్రెడిట్ కార్డు, PIN ఎంటర్ చేయకుండానే మొబైల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఎస్బీఐ కార్డు పే ఫీచర్ హోస్ట్ కార్డ్ ఎమ్యులేషన్ (HCE) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీంతో వేగవంతంగా పేమెంట్స్ చేసుకోవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ VISA ప్లాట్ ఫాంపై మాత్రమే లాంచ్ చేసింది. ఇప్పటివరకూ ఎస్బీఐ కార్డుదారులు 90లక్షల మంది ఉండగా.. మార్కెట్ షేరు 17శాతం వరకు పెరిగింది. కాంటాక్ట్ లెస్ ఎస్బీఐ కార్డుల్లో ఎస్బీఐ కార్డు పే ఫీచర్ కు తేడా ఉంది. అన్ని ఎస్బీఐ కార్డులు కాంటాక్ట్ లెస్ కార్డులే. ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు SBI card Pay ఫీచర్ ఎలా వినియోగించుకోవాలో చూద్దాం.

ఏంటీ ఈ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది : 
* ఈ ఫీచర్ సదుపాయం VISA ప్లాట్ ఫాంపై లాంచ్ చేశారు. 
* SBI కార్డుదారులు.. తమ ఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ SBI Card మొబైల్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి.
* తమ కార్డుపై One-Time రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
* ఒకసారి కార్డు రిజిస్టర్ అయ్యాక యూజర్లు తమ ఫోన్ స్క్రీన్ Unlock చేసుకోవాల్సి ఉంటుంది.
* PoS మిషన్ల దగ్గరకు మీ మొబైల్ డివైజ్ తీసుకురావాల్సి ఉంటుంది. 
* అప్పుడే మొబైల్ పేమెంట్స్ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. 
* ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లతో ఈ ఫీచర్ ఆపరేట్ చేసుకోవచ్చు.
* ఆండ్రాయిడ్ ఫోన్లలో (ఆండ్రాయిడ్ OS KitKat వెర్షన్ 4.4 ఆపై) ఉంటేనే సపోర్ట్ చేస్తుంది.
* వీసా కాంటాక్ట్ లెస్ / మాస్టర్ కార్డ్ కాంటాక్ట్ లెస్ మార్క్ / కాంటాక్ట్ లెస్ లోగో PoS మిషన్ దగ్గర ఉంచాలి.
* PoS మిషన్ నుంచి మీ కాంటాక్ట్ లెస్ కార్డు.. 4సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉండాలి.
* నాలుగు గ్రీన్ ఇండికేటర్ లైట్స్, బీప్ సౌండ్ వస్తుంది. అంటే.. మీ పేమెంట్ అయినట్టే.
* పీఓఎస్ మిషన్ స్ర్కీన్ పై కూడా ట్రాన్సాక్షన్ పూర్తి అయినట్టుగా మెసేజ్ వస్తుంది. 
* రూ.2వేల కంటే తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే 4 అంకెల PIN ఎంటర్ చేయక్కర్లేదు. 
* ఒక రోజులో గరిష్టంగా మీ కార్డునుంచి రూ.10వేల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
* ప్రతి ట్రాన్సాక్షన్ రూ.2వేలు నుంచి పదివేల వరకు పేమెంట్స్ చేసుకోవచ్చు.
* రోజులో రూ.2వేల పరిమితి దాటాక.. ప్రతి టాన్సాక్షన్ కు స్వైప్, 4-పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 

SBI కాంటాక్ట్ లెస్ కార్డుతో ప్రయోజనాలు ఇవే :
* వేగవంతంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. కార్డును డిప్పింగ్ లేదా స్వైపింగ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు.
* కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ సమయంలో మీ చేతిలో కార్డును వదిలేయకూడదు. 
* కార్డు కోల్పోవడం, మోసాలు, స్కిమ్మింగ్ మోసాలకు అవకాశం ఉండదు. 
* VISA/MasterCard కాంటాక్ట్ లెస్ కార్డులకు ఏకైక బుల్ట్ ఇన్ సీక్రెట్ కీ ఉంటుంది. 
* ప్రతి టాన్సాక్షన్ సమయంలో ప్రతి వీసా/మాస్టర్ కార్డు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ సెక్యూర్ ఉంటుంది.
* NFC టెక్నాలజీ యాక్టివేట్ అయిన PoS మిషన్లు ఉన్న అన్ని మర్చంట్ షాపుల్లో కార్డు పనిచేస్తుంది.
* NFC మెథడ్ అంటే.. రేడియో తరంగాల ద్వారా వైర్ లెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. 
* NFC మెథడ్ ద్వారా పేమెంట్ ఎన్ క్రిప్టడ్ ఫార్మాట్ లో ఉండటంతో పూర్తి భద్రతగా ఉంటుంది.

SBI Card Holder
SBI Bank
Mobile phone payments
Sbi card pay
NFC
HCE

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు