‘సంగతమిళన్’ - నవంబర్ 15 విడుదల

Submitted on 21 October 2019
SangaThamizhan  Releasing on 15th November

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్స్.. విజయ్ చందర్ దర్శకత్వంలో బి.భారతి రెడ్డి నిర్మించారు. యాక్షన్, రొమాన్స్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ‘సంగమిత్రన్’, ‘తమిళరాసన్’ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు.

ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇదిలా ఉంటే తమిళనాట దీపావళికి విడుదల కానున్న ‘సంగ తమిళన్’ వాయిదా పడింది. ‘దళపతి’ విజయ్ నటించిన ‘బిగిల్’, కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమాలు ఈ దీపావళికి భారీగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పోటీతో పాటు థియేటర్ల సమస్యతో ‘సంగతమిళన్’ దీపావళి రేసు నుండి తప్పుకుంది.

Read Also : ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్ - న్యూ పోస్టర్స్

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్.. నవంబర్ 15న ‘సంగతమిళన్’ భారీగా విడుదల కానుంది. నాజర్, శ్రీమాన్, సూరి, జాన్ విజయ్, అశుతోష్ రాణా, రవి కిషన్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా : ఆర్.వేల్‌రాజ్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, సంగీతం : వివేక్ - మెర్విన్, రచన, దర్శకత్వం : విజయ్ చందర్. 

Vijay Sethupathi
Raashi Khanna
Nivetha Pethuraj
B Bharathi Reddy
Vijay Chandar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు