అదిరిపోయే డేటా ఆఫర్లు : శాంసంగ్ గెలాక్సీ M40 వచ్చేసింది.. ధర ఎంతంటే? 

Submitted on 11 June 2019
Samsung Galaxy M40 With Triple Rear Cameras, Screen Sound Tech Launched in India

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ M సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ M40. గెలాక్సీ సిరీస్ టీజర్లపై రూమర్ల తర్వాత ఈ కొత్త స్మార్ట్ ఫోన్.. ఇండియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 11)న అధికారికంగా లాంచ్ అయింది.

హెచ్ఎండీ గ్లోబల్, రియల్ మి, షియోమీ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పోటీగా శాంసంగ్ గెలాక్సీ ఎం40 సిరీస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కొత్త గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్.. రూ. 19వేల 990 ప్రైస్ ట్యాగ్ తో జూన్ 18 నుంచి సేల్స్  ప్రారంభం కానుంది. 

గెలాక్సీ ఎం40లో ఫుల్ హెచ్ డీ ప్లస్ ఇన్ఫినిటీ O డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 SoC ఎట్రాక్టీవ్ చేసేలా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఉన్నాయి. స్పోర్ట్స్ ‘Screen Sound’ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ ఫోన్ లో తొలి సిగ్మంట్ కూడా ఇదే.

ఈ టెక్నాలజీ ద్వారా ఇయర్ ఫోన్స్ అవసరం లేకుండానే.. డిస్ ప్లే ప్యానెల్ పై ఆడియో వైబ్రేషన్స్ ఎనేబుల్ అయి ఉంది. 3,500mAh బ్యాటరీ సామర్థ్యంతో 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రూపొందింది. సాధారణ ఛార్జింగ్ తో పోలిస్తే మూడు రెట్లు వేగవంతంగా ఛార్జింగ్ అవుతుంది. 

జూన్ 18 నుంచి సేల్స్ ప్రారంభం :
ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M40 వేరియంట్ (6GB ర్యామ్ + 128GB స్టోరేజీ) ధర రూ.19వేల 990గా నిర్ణయించారు.  ఈ కొత్త స్మార్ట్ ఫోన్ .. జూన్ 18 మధ్యాహ్నాం 12 గంటల నుంచి ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ఇండియా, శాంసంగ్ ఆన్ లైన్ షాప్ ద్వారా సేల్స్ ప్రారంభం కానుంది. గెలాక్సీ ఎం40లో.. మిడ్ నైట్ బ్లూ, సీ వాటర్ బ్లూ గ్రేడియంట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. 

గెలాక్సీ M40.. లాంచింగ్ ఆఫర్లు  
రిలయన్స్ జియో.. డబుల్ డేటా ఆఫర్ : 
డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. జియో యూజర్లు రూ.198, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి రూ.198 రీఛార్జ్ పై జియో యూజర్లు రూ.3వేల 110 విలువైన 10 రీఛార్జ్ ల వరకు పొందవచ్చు. 

వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్ :
గెలాక్సీ ఎం40 స్మార్ట్ ఫోన్ పై.. వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.255 తో రీఛార్జ్ చేసుకుంటే.. రూ.3వేల 750 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.75ల విలువైన రీఛార్జ్ వోచర్లతో 50 రీఛార్జ్ లు వరకు చేయించినవారికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 18 నెలల వరకు రోజుకు 0.5GB డేటాను అదనంగా యూజర్లు పొందవచ్చు. 

ఎయిర్ టెల్ 100 శాతం డేటా ఆఫర్ :
గెలాక్సీ ఎం40 స్మార్ట్ ఫోన్ కింద ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు 10 నెలల వరకు అదనంగా 100 శాతం డేటాను అందిస్తోంది. రూ.249తో రీఛార్జ్ చేయిస్తే చాలు.. రోజుకు 4GB డేటాను పొందవచ్చు. అదనంగా 560GB డేటాను 10నెలల వరకు పొందవచ్చు. రూ.249 రీఛార్జ్ ప్లాన్ పై రోజుకు 6GB డేటా బెనిఫెట్ తో పాటు అదనంగా 10నెలల పాటు 840GB డేటాను పొందవచ్చు. 

గెలాక్సీ M40 స్పెషిఫికేషన్స్ - ఫీచర్లు ఇవే :
* 6.3 అంగుళాల Full HD+ ఇన్ఫినిటీ-O డిస్ ప్లే, కంట్రాస్ట్ రేషియో 1200:1
* 6GB ర్యామ్, 128GB ఇన్ బుల్ట్ స్టోరేజీ 
* మైక్రో SD కార్డు (512GB ఎక్స్ ప్యాండబుల్)
* 32MP ప్రైమరీ సెన్సార్, AI సీన్ ఆప్టిమైజర్, f/1.7లెన్స్
* 16MP కెమరా సెన్సార్ (ఫ్రంట్ సైడ్) 
* 5MP సెకండరీ కెమెరా, డెప్త్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సెన్సార్
* డిస్ ప్లే ప్యానెల్.. స్పోర్ట్స్ స్ర్కీన్ సౌండ్ టెక్నాలజీ, ఆడియో వైబ్రేషన్స్ 
* కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్, 480 నిట్స్ ఆఫ్ బ్రైట్ నెస్
* ఆక్టా-కోర్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 675 SoC
* అడ్రెనో 612 GPU
* 4K రికార్డింగ్, స్లో-మో, హైపర్ లాప్స్ 
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్ సైడ్)
* 4G VoLTE, Wi-Fi, బ్లూ టూత్
* GPS/ A-GPS, USB టైప్-C port
* 3,500mAh బ్యాటరీ 
* 15W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
* ఫోన్ సైజు 7.9mm మందం, 168గ్రామ్స్ బరువు

Samsung Galaxy M40
 Triple Rear Cameras
Screen Sound Tech
reliance jio
Airtel
Vodafone
offering data bundles

మరిన్ని వార్తలు