samantha tenth class progress report viral

నటనలోనే కాదు చదువులోనూ బ్రిలియంటే, సమంత టెన్త్ క్లాస్ ప్రొగ్రెస్ రిపోర్టు వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తనదైన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ద రోజుల్లోనే టాప్

తనదైన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ద రోజుల్లోనే టాప్ హీరోయిన్ అయ్యింది. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోతుంది. అదీ సమంత టాలెంట్. సమంత మంచి నటి మాత్రమే కాదు. గుడ్‌ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్‌ కూడా. స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇందుకు నిదర్శనం. 10, 11వ క్లాసుల్లో మంచి మార్కులే సంపాదించిందీ బ్యూటీ. ఇందుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్సు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రోగ్రెస్ రిపోర్టు సమతం ఫేస్ బుక్ పేజీలో ఉంది.

వందకు 100 మార్కులు:
చెన్నైలోని CSI సెయింట్‌ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంత చదువుకుంది. 2002లో పదో తరగతిలో Maths పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా..Maths పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మొత్తంగా వెయ్యి మార్కులకు గాను 887 మార్కులు వచ్చాయి. సమంత మా స్కూల్ కు ఓ ఆస్తి అని అందులో రాసి ఉంది. అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టుల వారిగా ప్రతిభను కనబర్చింది.

2

 

 

1

 

డిజిటల్ వరల్డ్‌పై సమంత ఫోకస్:
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే-‘ చిత్రంతో సమంత ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నాగచైతన్య సరసన యాక్ట్ చేసింది. తన అందంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఆ తరువాత చైతూ, సామ్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సమంత ప్రస్తుతం సినిమాల కంటే కూడా డిజిటల్ వరల్డ్‌పై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తన తొలి వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసింది. మనోజ్ బాజ్‌పెయ్ హీరోగా వచ్చిన ది ఫ్యామిలీ మెన్ 2లో విలన్ పాత్రలో నటించింది సమంత. త్వరలోనే ఇది స్ట్రీమ్ కానుంది. ఇక దాంతో పాటు తమిళనాట విజయ్ సేతుపతి హీరోగా నయనతార బాయ్‌ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది సమంత.

కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందబోతోందని గతంలో విగ్నేష్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. నయనతార, సమంత కలిసి ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఈ సినిమాతో రేర్ కాంబినేషన్ సెట్ చేసాడు విఘ్నేష్. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన సమంత.. ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో కలిసి బైక్‌పై లాంగ్ ట్రిప్ వెళ్లొచ్చినట్లు తెలుస్తుంది.

Read:  నయనతార ఓ ఫైటర్.. కత్రినా కైఫ్