Saltanat Akbari,107  old women Has Recovered From Coronavirus Reports Iranian Media

కరోనాను జయించిన 107 ఏళ్ల వృద్ధురాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కష్టాలతో పోరాటంలోనే కాదు కరోనాను కూడా గెలుస్తున్నారు మహిళలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు 107 సంవత్సరాలు ఉన్న సాల్తానాత్ అక్బరీ అనే మహిళ.  ప్రపంచమంతటినీ కరోనా మహమ్మారి కల్లోలం చేస్తున్న ఎంతోమంది ఈ వైరస్ బారిని పడి ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఈక్రమంలో ఇరాన్ కు చెందిన సాల్తానాత్ అక్బరీ అనే 107 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది.దీంతో ఆమెను అరక్ లోని ఖన్సారీ హాస్పిటల్ కు తరలించారు. వైద్య సిబ్బంది చేసిన సేవలతో ఆమె కరోని నుంచి బైటపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ సెమీ ఆఫీషియల్ ఫార్సా వార్తా సంస్థ ఆదివారం (మే 24,2020)న వెల్లడించింది.  

Read: ఒకే ఒక్క డాలర్ కే ప్రముఖ మీడియా సంస్థ అమ్మకం..కొనేసిన సీఈవో