సాండ్ కీ ఆంఖ్ - ట్రైలర్

Submitted on 23 September 2019
Saand Ki Aankh - Official Trailer

బాలీవుడ్‌లో గతకొద్ది కాలంగా బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్‌అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా.. తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో.. 'సాండ్ కీ ఆంఖ్'.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మాతలు. రీసెంట్‌గా 'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా ఉంది. 87 ఏళ్ళ చంద్రో తోమర్‌గా భూమి, 82 ఏళ్ళ ప్రకాషీ తోమర్‌గా తాప్సీ  కనిపించనున్నారు. ఈ మూవీ కోసం వీరిద్దరూ షూటింగ్‌లో కోచింగ్ కూడా తీసుకున్నారు.

Read Also : భజన బ్యాచ్ - వెబ్ సిరీస్..

60 ఏళ్ళ వయసులో షూటర్స్‌గా.. వందలాది పతకాలు సాధించి, ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు చంద్రో, ప్రకాషీ తోమర్.. ప్రకాష్ ఝా, వినీత్ కుమార్ సింగ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. 2019 దీపావళికి సాండ్ కీ ఆంఖ్ రిలీజ్ కానుంది. మ్యూజిక్ : విశాల్ మిశ్రా, సినిమాటోగ్రఫీ : సుధాకర్ రెడ్డి యెక్కంటి, స్క్రీన్‌ప్లే : జగదీప్ సింధు.


 
 

Taapsee Pannu
Bhumi Pednekar
Tushar Hiranandani

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు