ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

Submitted on 21 October 2019
RTC driver suicide attempt in karimnagar

కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ డిపో ఎదుట జంపయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. ఇది గమనించిన పోలీసులు  జంపయ్యను అడ్డుకున్నారు. ఆత్మహత్య లతో సమస్యలు పరిష్కారం కావని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తోటి కార్మికులు కూడా జంపయ్యకు నచ్చజెప్పారు. అనంతరం జంపయ్యను పోలీస్‌ స్టేషన్ కు తరలించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నెలకొన్న పరిణామాలాతో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అక్టోబర్ 12వ తేదీ శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడనే ఉన్న వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన 2019, అక్టోబర్ 13వ తేదీ ఆదివారం కన్నుమూశాడు. అతని మృతిపై కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికుడు చనిపోయాడంటూ ఫైర్ అయ్యారు. 
 

ఆర్టీసీ కార్మికుల సమ్మె 17 వ రోజు కొనసాగుతోంది. కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పట్టువీడటం లేదు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా అందుకు సుముఖంగా లేదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. అటు కార్మికులు సైతం తమ డిమాండ్ల పరిష్కారానికి ఆమోదం తెలిపితే గానే సమ్మె విరమణ లేదంటున్నారు.

సమ్మెతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ బస్సులను నడుపుతోంది. సరిపడా బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ్టి నుంచి విద్యాలయాలు ఓపెన్ అయ్యాయి కనుక మరిన్ని సమస్యలు తలెత్తనున్నాయి. 

RTC
Driver
Suicide Attempt
Karimnagar
Strike

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు