అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

Submitted on 12 January 2019
rtc bus accident at secunderabad

సికింద్రాబాద్: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాస్‌పోర్ట్ కార్యాలయం ముందు 2019, జనవరి 13వ తేదీ శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు  ఫెయిలవటంతో ఢివైడర్‌ను తాకి అటుగా వెళ్తున్న జనం పైకి బస్సుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్‌లోచే చనిపోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక ఆటో, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి.  ఘటన తర్వాత బస్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు గమనించి పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Secunderabad
Bus Accident
Breaks Fail
TSRTC

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు