కొమురం భీమ్ జయంతి సందర్భంగా RRR టీమ్ ట్వీట్

Submitted on 22 October 2019
RRR Team Special Tweet on the occasion Of  revolutionary freedom fighter Komaram Bheem birth anniversary

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే..

అక్టోబర్ 22.. తెలంగాణ గడ్డపై ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, అమరుడైన గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీమ్ జయంతి.. ఈ సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ స్పెషల్ ట్వీట్ చేసింది.

Read Also : ‘పాగల్ పంతీ’ - ట్రైలర్!

‘గొప్ప ధైర్య‌వంతుడైన తెలంగాణ స్వాతంత్ర్య వీరుడు కొమురం భీమ్‌గారిని ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. మా ‘ఆర్ఆర్ఆర్’ లో తార‌క్‌ను కొమురం భీమ్‌గా వెండితెర‌పై చూపించ‌డానికి చాలా ఆతృత‌గా, ఆసక్తితో ఎదురుచూస్తున్నాం’ అంటూ మూవీ టీమ్ ట్వీట్ చేశారు.
 

RRR
Komaram Bheem birth anniversary
NTR
Ram Charan
Alia Bhatt
DVV Danayya
SS Rajamouli

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు