#RRR మూవీ : రిలీజ్ డేట్ ఫిక్స్, బడ్జెట్ ఎంతో చెప్పేశారు

Submitted on 14 March 2019
RRR Release Date Fixed, Budget around 400Cr

#RRR మూవీని అల్లూరి, కొమరం భీం లింక్ చేస్తూ తీస్తున్నట్లు స్పష్టం చేసేశారు. ఇందులో అల్లూరిగా రాంచరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరితోపాటు భారీ స్థాయిలో తారగణం ఉన్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్నట్లు తెలిపారు.
Read Also : అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిస్తే #RRR మూవీ

అజయ్ దేవగన్ ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రామ్‌చరణ్ పక్కన ఇందులో ఆలియా భట్ నటిస్తుందని, ఎన్టీఆర్ పక్కన జంటగా.. డైజీ అనే విదేశీ యువతి నటిస్తునట్లు చెప్పారు. సముద్రఖని కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 
Read Also : #RRR మూవీ : ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, అలియా భట్

ఇదే సమయంలో సినిమాకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్‌లను సినిమా నిర్మాత డీవీవీ దానయ్య తెలియజేశారు. ఈ సినిమాను జులై 30, 2020న విడుదల చేస్తున్నామని, అలాగే సినిమా బడ్జెట్ రూ.350కోట్లు.. నుండి రూ.400కోట్లు వరకు అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. బాహుబలి తర్వాత అంత పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న తెలుగు సినిమా ఇదే అని అంటున్నారు. ఇక ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రతీ లాంగ్వేజ్‌లో సినిమాకు ఒక్కొక్క టైటిల్ పెడుతున్నామని, అయితే అన్నింటినీ #RRR వచ్చేలా పెడుతామని తెలిపారు.
Read Also : #RRR మూవీ అద్భుతంగా ఉంటుంది : ఎన్టీఆర్

July 30
2020
RRR
NTR
ramcharan
DVV Dhanayya
Rajamouli

మరిన్ని వార్తలు