‘ఆర్ఆర్ఆర్’ పేరడి.. ఆర్.నారాయణ మూర్తిలా అన్నీ నువ్వే చేసెయ్..

rrr-parody-video-goes-viral

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్‌తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి వాటిలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవడంతో తమ క్రియేటివిటీకి పదును పెడుతూ కొత్త కొత్త మీమ్స్, పేరడీలు రూపొందిస్తున్నారు.

తాజాగా ఓ వ్యక్తి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’.. యంగ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘భీం ఫర్ రామరాజు’ పేరుతో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఓ అభిమాని పేరడీ చేసాడు.

ప్యాంటు వేసుకుని విల్లు చేత బట్టుకుని సీరియస్‌గా చరణ్‌ని అనుసరించే ప్రయత్నం చేసాడు. అందుబాటులో తనకున్న వనరులతో అతనెంత కష్టపడి వీడియో చేసినా ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం నవ్వు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అతని చూపులు, పిల్లోకి కిక్ ఇస్తే రివర్స్‌లో వచ్చి తగలడం వంటివి కామెడీగా అనిపించాయి. ‘అంతటితో ఆగకుండా.. ఆర్ నారాయణ మూర్తి లాగా అన్ని క్యారెక్టర్ నువ్వే చేసి రాజమౌళి కంటే ముందు రిలీజ్ చేయ్’.. అంటూ తనను ఎంకరేజ్ చేస్తున్నారు. వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి మరి..

మరిన్ని తాజా వార్తలు