లో-కాస్ట్ మోడల్ లాంచ్ : రాయల్ ఎన్ ఫీల్డ్ Classic 350S బుల్లెట్

Submitted on 13 September 2019
Royal Enfield launches low-cost Classic 350 S; check out price, engine, design

భారత మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి రెండు కొత్త వేరియంట్ బుల్లెట్లను లాంచ్ చేసింది. మార్కెట్లో అతి తక్కువ ధరకే క్లాసిక్ 350S వేరియంట్ (ఎక్స్-షోరూం) ధర రూ.1.45 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ప్రామాణిక క్లాసిక్ 350లోని డ్యుయల్ ఛానెల్ ABS యూనిట్ మాదిరిగా కాకుండా బుల్లెట్ 'ఎస్' మోనికర్ సింగిల్-ఛానల్ ABSను సూచిస్తుంది. క్లాసిక్ 350 బైకు ప్రమాణాల్లో కొంత వ్యయాన్ని తగ్గించిన తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్.. ప్రామాణిక క్లాసిక్ 350 బుల్లెట్ కంటే దాదాపు రూ.9వేలు చౌకైన ధరకే క్లాసిక్ 350S రిలీజ్ చేసింది. 

ఎక్స్ షోరూం ధర రూ.1.54లక్షలకు అందుబాటులో ఉంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 350KS బుల్లెట్ సిరీస్ ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. నెల క్రితమే వీటి ప్రారంభ వేరియంట్లు 350ES ప్రారంభమయ్యాయి. ఈ బైకులన్నీ బ్లాక్ ఔట్ థీమ్, ఎక్స్ సీవ్ క్రోమ్, ఇతర తక్కువ ఖర్చుతో కూడిన ప్రమాణాలతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం... రాయల్ ఎన్ ఫీల్డ్, క్లాసిక్ 350S కేరళ, తమిళనాడులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

క్లాసిక్ 350 S మోడల్ బుల్లెట్.. ప్యూర్ బ్లాక్, మెర్క్యూరీ సిల్వర్ తో రెండు కలర్ల వేరియంట్లలో వచ్చింది. కాస్ట్ తగ్గించడంతో 350 S ఫీచర్లలో ఇంజిన్, బాడీ ఫెండర్స్, వీల్స్, రియర్ వ్యూ మిర్రర్స్, క్రోమ్ వంటి బ్లాకెండ్ కంపోనెంట్లతో డిజైన్ చేశారు. ప్రామాణిక వేరియంట్ ప్యూయల్ ట్యాంకుపై వచ్చిన గ్రిప్స్, 3D గ్రాఫిక్స్ బదులుగా సింపుల్ డికాల్ ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ మార్పుల మాదిరిగా కాకుండా బుల్లెట్ పనితీరు స్టాండర్డ్ మోడల్ క్లాసిక్ 350 మాదిరిగానే ఉంటుంది. 

క్లాసిక్ 350 మాదిరిగానే క్లాసిక్ 350S లో కూడా 346CC సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. పవర్ యూనిట్ విషయానికి వస్తే.. ఉత్పత్తి చేసే విద్యుత్ సామర్థ్యం 5,250rpm దగ్గర 19.8Bhp వరకు ఉంటుంది. 4,000 rpm దగ్గర 28Nm పీక్ టర్క్యూ ఉండి మొత్తంగా 5స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఈ కొత్త బుల్లెట్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ ఉంటుంది. రియర్ లో గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్బర్లు జతగా ఉంటాయి. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రియర్ ఫీచర్లలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. 

ROYAL ENFIELD
 low-cost
Classic 350 S
engine
DESIGN

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు