రోస్ వ్యాలీ స్కాం‍ : ప్రముఖ నటికి ఈడీ నోటీసులు

Submitted on 10 July 2019
Rose Valley Scam: After Prosenjit Chatterjee, ED Summons Actor Rituparna Sengupta

వెస్ట్ బెంగాల్ లో సంచలనంగా మారిన రోస్ వ్యాలీ స్కాం లో ఒక్కోక్కరూ బయటపడుతున్నారు. ఈ స్కాంలో ఇప్పటికే కొంతమంది సినీ నటులు, రాజకీయ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ప్రముఖ బెంగాల్ నటి రీతూవర్ణ సేన్ గుప్తాకు ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఇవాళ(జులై 10, 2019) నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోపు తమముందుకు హాజరుకావాలని తెలిపారు. రీతుపర్ణ బాలీవుడ్, బెంగాలీతో పాటు టాలీవుడ్‌లో కూడా నటించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఘటోత్కచుడు, ఆయనకి ఐదుగురు వంటి వివిధ తెలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.   

అయితే ఇదే స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్ జిత్ ఛటర్జీకి కూడా హస్తం ఉందంటూ.. మంగళవారం (జులై 9, 2019) ED నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో కాష్ ట్రాన్సాక్షన్స్ జరిపారని ED తెలిపింది. జూలై 19, 2019లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్‌ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్‌ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్‌ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని రూ. 25కోట్లు తీసుకున్న ఆరోపణలతో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. 

Rose Valley Scam
Ed notices
Actor Rituparna Sengupta


మరిన్ని వార్తలు