మీ క్రియేటివిటీ తగలెయ్యా.. రోజా, శేఖర్ మాస్టర్లను వదలట్లేదుగా..

roja-and-sekhar-master-meems-viral-social-media

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్‌తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటి వాటిలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవడంతో తమ క్రియేటివిటీకి పదును పెడుతూ కొత్త కొత్త మీమ్స్ రూపొందిస్తున్నారు.

కొద్దిరోజులుగా రోజా, శేఖర్ మాస్టర్ల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌స్క్రీన్ రోజా, శేఖర్ మాస్టర్‌ల డ్యాన్స్, కెమిస్ట్రీ, రొమాన్స్ ఏ రేంజులో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరికీ అలా సింక్ అయింది మరి. పాలిటిక్స్, టీవీ షోలతో బిజీగా ఉండే రోజా ఈ జెనరేషన్ యాంకర్లతో పోటీపడుతూ.. ఇప్పటికీ అదే ఎనర్జీతో తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తోంది.

ఇప్పటికే రోజా, శేఖర్ మాస్టర్లపై పలు మీమ్స్ వచ్చాయి. తాజాగా రోజా, శేఖర్ మాస్టర్‌లను తాటిచెట్టు ఎక్కించారు మీమ్స్ రాయుళ్లు. ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరిపై రూపొందించన బాక్సింగ్ రింగ్, బాహుబలి సీన్ వంటి పలు మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

 

మరిన్ని తాజా వార్తలు