రోహిత్ శర్మ చుట్టూ తిరుగుతున్న బ్రాండింగ్ కంపెనీలు

Submitted on 30 November 2019
Rohit Sharma is New Blue-Eyed Boy for Corporates

రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2019 నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఓపెనర్‌గానూ టెస్టు ఫార్మాట్‌లో అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ కార్పొరేట్ కళ్లల్లో పడ్డాడు. అడ్వర్టైజ్‌మెంట్‌లు, మార్కెటింగ్ ఏజెన్సీలు అద్భుత ప్రదర్శనను చేసిన ప్లేయర్లను చుట్టుముట్టేస్తుంటాయి. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు రో'హిట్'. ప్రస్తుతం రోహిత్ సంతకం కోసం 20బ్రాండ్లు అగ్రిమెంట్లతో ఎదురుచూస్తున్నాయి. 

'ప్రస్తుతం కొన్ని ఫామస్ బ్రాండ్లు సియెట్ టైర్స్, అడిడాస్, హుబ్లట్ వాచెస్, రెలిస్ప్రే, రస్నా, ట్రుసోక్స్, షార్ప్ ఎలక్ట్రానిక్స్, డ్రీమ్ 11 లాంటివి రోహిత్ కోసం క్యూ కట్టాయని ప్రముఖ క్రికెటర్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, రోహిత్‌కు మార్కెట్‌లో బ్రాండ్ వాల్యూ రోజుకు కోటి రూపాయలు. ఎలాంటి ఈవెంట్‌కైనా ఒకేలా వసూలు చేస్తున్నాడట. 

'వరల్డ్ కప్ లో ఐదు సెంచరీలు చేసి ఒక్కసారిగా బ్రాండ్ వాల్యూ పెంచేసుకున్నాడు. టెస్టు ఓపెనర్‌గా దిగి దానిని కొనసాగిస్తున్నాడు. క్రికెట్ ప్రదర్శనలోనే కాకుండా వ్యక్తిగతంగానూ యూత్‌తో పాటు ఫ్యామిలీలకు కూడా రోహిత్ బాగా దగ్గరయ్యాడు' అని రోహిత్ బ్రాండింగ్ చేస్తున్న ఓ కంపెనీ యజమాని తెలిపాడు. 

Rohit Sharma
Corporates
india
Team India

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు