అర్చకుడిగా రోబో : మంత్రాలు చదువుతుంది, పూజలు చేయిస్తుంది

Submitted on 19 August 2019
robo-temple-priest-japan

జపాన్ క్యోటోలోని 400 ఏళ్ల ప్రాచీన కొడాయ్‌జీ ఆలయానికి పూజారిగా ఓ రోబోను నియమించారు. ఈ రోబోకు బుద్ధిజానికి సంబంధించిన సమగ్ర సమాచారమూ తెలుసు. అన్ని రకాల పూజలూ తెలుసు. భక్తులు రాగానే గౌరవ వందనం చేస్తూ... ఆలయానికి ఆహ్వానిస్తుంది. తర్వాత వారి ముందు కొన్ని మంత్రాలు చదువుతుంది. వారితో కొన్ని పూజలు చేయిస్తుంది. వారికి కొన్ని గౌతమ బుద్ధుడి జ్ఞాన బోధలు చేస్తుంది.

ఈ కొత్త రోబోకి మరో గొప్ప లక్షణం కూడా ఉంది. ఇది ఏరోజు కారోజు... కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ... వాటిని కూడా తన మెమరీ పవర్‌లోకి ఎక్కించేసుకోగలదు. మనుషుల కంటే ఎక్కువ నాలెడ్జితో ఉన్న ఈ రోబో... పరిస్థితులకు తగ్గట్టుగా మంచి మాటలు చెబుతుంది. కష్టాలు, బాధల్లో ఉన్నవారికి ఓదార్పు ఇస్తుంది.

అవతలి వాళ్లు ఎలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో గ్రహించి... అందుకు తగ్గట్టుగా... మనసు కుదుటపడేలా మాట్లాడుతుంది. తల, చేతులూ, నడుం కదపడేకాదు...హావభావాలు పలికిస్తూ అచ్చం మనిషిలా ఓదారుస్తుంది. మిందార్ అని పిలిచే ఈ రోబో ఇప్పుడు కొడాయ్‌జీ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మహాత్మాగాంధీకి గుడి కట్టేశారు

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు