అంత తొందరెందుకు పంత్: గల్లీ క్రికెట్ అనుకున్నావా..

Submitted on 8 November 2019
Rishabh Pant commits ‘schoolboy error’, redeems himself later

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో ఘోర తప్పిదంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుజరాత్ లోని రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ లో చేసిన పొరబాటుతో బంగ్లాదేశ్‌కు ఫ్రీ హిట్ వచ్చేలా చేశాడు. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌(29: 21 బంతుల్లో 4ఫోర్లు)ని స్టంపౌట్ చేసే క్రమంలో పంత్ పెద్ద పొరబాటు చేశాడు. దీంతో అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. బంగ్లా ప్లేయర్లకు ఫ్రీ హిట్ దక్కింది. 

ముందుగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ 6వ ఓవర్ లో చాహల్ బౌలింగ్‌ చేస్తున్నాడు. 3వ బంతిని క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడే క్రమంలో లిటన్ దాస్ ఫెయిలయ్యాడు. దానిని అందుకోవాల్సిన పంత్ తొందరపడి స్టంప్ ల కంటే ముందుకొచ్చి అందుకున్నాడు. అంతేకాకుండా స్టంపౌట్ చేసే క్రమంలో వికెట్లను గిరాటేశాడు. కానీ.. రిప్లైని పరిశీలించిన అంపైర్ పంత్ తప్పిదం కారణంగా బంతిని నోబాల్‌గా ప్రకటించి బంగ్లాదేశ్‌కి ఫ్రీ హిట్ అవకాశం కల్పించాడు. 

ఆ తర్వాత రెండు ఓవర్ల వ్యవధిలోనే తెలివిగా లిట్టన్ దాస్‌ని స్టంపౌట్ చేయడం ద్వారా పంత్ తన తప్పిదాన్ని దిద్దుకున్నాడు. మరోసారి బ్యాట్ ఎడ్జ్ ను తాకి పంత్ మీదకు వచ్చిన బాల్ ను అందుకోలేకపోయిన పంత్.. హౌ వజ్ దట్-హౌ వజ్ దట్ అంటూ గట్టిగా అరుస్తూ బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్ చేశాడు. ముందుకు వెళ్లిన బ్యాట్స్ మన్ లిటన్ దాస్ ను వెనుకే వెళ్లి క్షణాల్లో బంతిని అందుకుని స్టంపౌట్ చేశాడు. దీంతో తన తప్పును తానే సరిదిద్దుకునే అవకాశం చిక్కింది.   

 

rishabh pant
MS Dhoni
Team India
india
cricket

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు