చిన్నారి ప్రాణాలు కాపాడిన రిక్షా

Submitted on 21 October 2019
rickshaw saved a child in madhyapradesh

రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందపడిన చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షా అతడి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గఢ్ లో చోటు చేసుకుంది. 35 అడుగుల ఎత్తున్న రెండంతస్తుల బిల్డింగ్ నుంచి ప్రమాదవశాత్తు చిన్నారి జారింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న రిక్షాలోని సీటుపై పడటంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

కుటుంబ సభ్యులతో కలిసి రెండో అంతస్తులో తన కుమారుడు ఆడుకుంటున్నాడని బాలుడి తండ్రి తెలిపారు. తన తండ్రి, సోదిరి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. చిన్నారి ఆడుకుంటూ బాల్కనీలోకి వెళ్లి రెయిలింగ్ కు వేలాడటం మొదలు పెట్టాడు. ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ తప్పడంతో కిందపడిపోయాడు. 

అయితే అదే సమయంలో రిక్షావాలా దేవుడిలా వచ్చి తన కుమారుడిని కాపాడారని కొనియాడారు. వెంటనే తాము బాలుడిని దవాఖానకు తీసుకెళ్లామని వివరించారు. సిటీ స్కాన్, ఎక్స్ రే, ఇతర పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. 
 

rickshaw
save
child. madhyapradesh

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు